Telugu Global
NEWS

బాబును నమ్మడానికి వీల్లేదు : యునైటెడ్ ఫ్రంట్

” తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని నమ్మడానికి వీల్లేదు. ఆయన తన అవసరాల కోసమే మనతో కలుస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి…. తనపై కేసుల కారణంగా వాటి నుంచి తప్పించుకునేందుకు మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన మాటల్లో విశ్వసనీయ లేదు…. చంద్రబాబు నాయుడికి సిద్ధాంత భూమిక లేదు. కేవలం అధికారమే పరమావధి. రెండు వైరుధ్య సిద్ధాంతాలున్న భారతీయ జనతా పార్టీతోను, వామపక్షాలతోనూ కూడా కలుస్తారు. అంతెందుకు మూడున్నర […]

బాబును నమ్మడానికి వీల్లేదు : యునైటెడ్ ఫ్రంట్
X

” తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని నమ్మడానికి వీల్లేదు. ఆయన తన అవసరాల కోసమే మనతో కలుస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి…. తనపై కేసుల కారణంగా వాటి నుంచి తప్పించుకునేందుకు మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన మాటల్లో విశ్వసనీయ లేదు…. చంద్రబాబు నాయుడికి సిద్ధాంత భూమిక లేదు. కేవలం అధికారమే పరమావధి. రెండు వైరుధ్య సిద్ధాంతాలున్న భారతీయ జనతా పార్టీతోను, వామపక్షాలతోనూ కూడా కలుస్తారు. అంతెందుకు మూడున్నర దశాబ్దాల వైరం ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే కలిసారు. ఆయన మాటలను నమ్మి మోసపోడానికి సిద్ధంగా ఉండకూడదు” ఇవి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకుల అభిప్రాయాలు.

నాలుగున్నరేళ‌్లు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ హఠాత్తుగా ప్లేటు మార్చడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర పక్షాలతో కలిపి ఓ కూటమి ఏర్పాటుకు ఉరుకులు, పరుగులు పెట్టడం వెనుక ఆయన స్వార్ధమే ఎక్కువగా ఉందని వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇదే అభిప్రాయాన్ని కొందరు నాయకులు వ్యక్తం చేసినా ప్రధాని నరేంద్రమోడీని గద్దెదించడంలో కలిసి వస్తారని అందరూ భావించారు.

అయితే, మారిన పరిణామాలను అంచనా వేస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు చంద్రబాబు నాయుడు ప్లేటు ఫిరాయించడంలో ఘనాపాటీ అని అంటున్నారు. తనపై ఏ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదని, ఒకవేళ ఎన్నికల అనంతరం యునైటెడ్ ఫ్రంట్ కు అశించినన్ని స్ధానాలు రాకపోతే వెంటనే నరేంద్ర మోడీ చెంతకు చేరిపోతారనే అనుమానం వివిధ పార్టీలకు చెందిన వారిలో కనపడుతోంది.

ఎన్నికల వరకూ స్నేహాన్ని నటించే చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం ఇప్పటి గాలి వాటానికి అనువుగా తన మాట… పల్లవి మార్చేస్తారని దక్షిణాదికి చెందిన ఓ నాయకుడు చెప్పారు. అంతకు మునుపు కూడా ఒకసారి కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి…. ఎన్నికలు కాగానే బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్రహించి వెంటనే ప్లేటు ఫిరాయించి బీజేపీలోకి జంప్ అయ్యాడని…. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు.

దీనిని అంచనా వేసి చంద్రబాబు నాయుడితో సఖ్యంగా మెలగాలా..? ఎంత వరకూ ఆయనను నమ్మవచ్చు..? అన్నది బేరీజు వేసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

చంద్రబాబు నాయుడి గురించి పూర్తిగా తెలిసిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశంతో పొత్తు వద్దు అంటూ తమ అధినేతకు విన్నవించుకుంటున్నారని కూడా ఆ నాయకులు అంటున్నారు.

మొత్తానికి చంద్రబాబు నాయుడ్ని ఏ రాజకీయ పార్టీ నమ్మే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  28 Feb 2019 7:07 AM IST
Next Story