Telugu Global
Cinema & Entertainment

118 ప్రీ-రిలీజ్ బిజినెస్

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది 118 సినిమా. కల్యాణ్ రామ్, నివేత థామస్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాను టేబుల్ ప్రాఫిట్ రేటుకు అమ్మారు. 11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను మొత్తంగా 14 కోట్ల రూపాయలకు అమ్మారు. ఈ సినిమాను ప్రత్యేకంగా చూసిన దిల్ రాజు, ఆంధ్రా-నైజాం […]

118 ప్రీ-రిలీజ్ బిజినెస్
X

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది 118 సినిమా. కల్యాణ్ రామ్, నివేత థామస్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాను టేబుల్ ప్రాఫిట్ రేటుకు అమ్మారు.

11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను మొత్తంగా 14 కోట్ల రూపాయలకు అమ్మారు. ఈ సినిమాను ప్రత్యేకంగా చూసిన దిల్ రాజు, ఆంధ్రా-నైజాం రైట్స్ దక్కించుకున్నారు. అటు ఇటుగా 5 కోట్ల రూపాయలకు దిల్ రాజు ఈ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. ఇక సీడెడ్ ను కోటి రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాను నిర్మాతలే స్వయంగా విడుదల చేస్తున్నారు.

ఇక శాటిలైట్, డబ్బింగ్ విషయానికొస్తే.. జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను 3 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అటు హిందీ డబ్బింగ్ రైట్స్ కింద మరో 4 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆడియోతో పాటు మిగతా రైట్స్ అన్నీ కలుపుకొని ఈ సినిమా 14 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. సో.. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించాలంటే కనీసం 16 కోట్లు (ఖర్చులతో కలుపుకొని) కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

First Published:  28 Feb 2019 8:06 AM GMT
Next Story