ప్రజలకు మరింత దగ్గరవుతున్న జగన్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో నేడు సొంత ఇంటి గృహాప్రవేశం చేశారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన ఇంటిలోకి జగన్ కుటుంబ సభ్యులతో సహా కాలు పెట్టాడు. అది వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇల్లు మాత్రమే కాదు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కార్యాలయం కూడా. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదారాబాదు నుంచి రాజకీయాలు చేస్తున్నారంటూ చేస్తున్న ప్రకటనలకు […]
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో నేడు సొంత ఇంటి గృహాప్రవేశం చేశారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన ఇంటిలోకి జగన్ కుటుంబ సభ్యులతో సహా కాలు పెట్టాడు. అది వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇల్లు మాత్రమే కాదు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కార్యాలయం కూడా.
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదారాబాదు నుంచి రాజకీయాలు చేస్తున్నారంటూ చేస్తున్న ప్రకటనలకు ఇక ఫుల్‌స్టాప్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక కార్యక్రమాలన్నీ ఇక విజయవాడ నుంచే జరుగుతాయి.
తెలంగాణలో పార్టీ ఉన్నా ఆ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలన్ని హైదారాబాదులోని లోటస్‌పాండ్‌లో ఉన్న కార్యాలయం నుంచే నిర్వహిస్తారు. విజయవాడలో నూతన గృహప్రవేశం రానున్న రోజులలో అధికార ప్రవేశానికి నాందీ వాచకం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇన్నాళ్లు వైఎస్‌ఆర్ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు తమ అధినేతను కలుసుకునేందుకు ఇబ్బందిపడేవారు. ఇకపై అటువంటి ఇబ్బందుల ఏమి ఉండవని, భవిష్యత్తులో ఎవరైన, ఎప్పుడైన జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వీలుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రానున్న ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయానికి విజయవాడలో నిర్మించిన నూతన కార్యాలయం ఎంతో దోహదపడుతుందని అంటున్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రాష్ట్రంలోనే ఇల్లు నిర్మించుకోవడం, కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం అధికారానికి దగ్గరైనట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక నుంచి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూ జగన్ స్దానికతను కాని, హైదరాబాదునుంచి రిమోట్ ఆపరేషన్స్ అని కాని విమర్శించేందుకు వీలుండదని అంటున్నారు. ఇక ముందు జగన్ చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవాడ నుంచే కావడంతో ప్రజలలో ఓ నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన విజయవాడలోని ఒక గెస్ట్ హౌస్ లో ఉంటున్నారని, అధికార నివాసం తప్ప సొంత నివాసం ఏర్పాటు చేసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.