గృహప్రవేశం చేసిన జగన్....
వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంటిలోకి అడుగుపెట్టారు. ఉదయం కుటుంబసమేతంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఇంటికి పక్కనే నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలందరినీ వైఎస్ జగన్.. తన గృహప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా తరలివచ్చారు. గృహప్రవేశం చేసిన జగన్‌కు పార్టీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. ఇకపై జగన్ కుటుంబం ఈ ఇంటిలోనే ఉండనుంది. పార్టీ కార్యక్రమాలు కూడా కొత్త కార్యాలయం నుంచే నిర్వహిస్తారు.

వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంటిలోకి అడుగుపెట్టారు. ఉదయం కుటుంబసమేతంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఇంటికి పక్కనే నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలందరినీ వైఎస్ జగన్.. తన గృహప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా తరలివచ్చారు.
గృహప్రవేశం చేసిన జగన్‌కు పార్టీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. ఇకపై జగన్ కుటుంబం ఈ ఇంటిలోనే ఉండనుంది. పార్టీ కార్యక్రమాలు కూడా కొత్త కార్యాలయం నుంచే నిర్వహిస్తారు.