Telugu Global
Cinema & Entertainment

రాజ్ తరుణ్ కొత్త సినిమా సంగతులు

లవర్ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయాడు రాజ్ తరుణ్. అలా తెరమరుగైన ఈ హీరో ఎట్టకేలకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు రాజ్ తరుణ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 2 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజ్ తరుణ్. ఈ మేరకు రాజ్ తరుణ్ వద్ద […]

రాజ్ తరుణ్ కొత్త సినిమా సంగతులు
X

లవర్ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయాడు రాజ్ తరుణ్. అలా తెరమరుగైన ఈ హీరో ఎట్టకేలకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు రాజ్ తరుణ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 2 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజ్ తరుణ్. ఈ మేరకు రాజ్ తరుణ్ వద్ద అడ్వాన్స్ కూడా ఉంది. ఒప్పందం ప్రకారం దిల్ రాజు బ్యానర్ లో లవర్ సినిమా చేశాడు. ఇప్పుడు రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

గతంలో సుధీర్ బాబు హీరోగా ఆడుమగాడ్రా బుజ్జి అనే సినిమా చేశాడు కృష్ణారెడ్డి. మళ్లీ ఇన్నేళ్లకు రాజ్ తరుణ్ సినిమాతో దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు.

బడా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన దిల్ రాజు.. 10-12 కోట్ల బడ్జెట్ లో సినిమాలు పూర్తిచేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈమధ్య ఈ నిర్మాత డిజైన్ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు మీడియం-రేంజ్ బడ్జెట్ సినిమాలే.

ఇందులో భాగంగానే రాజ్ తరుణ్-కృష్ణారెడ్డి సినిమా కూడా లాక్ అయింది. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు బయటకొస్తాయి.

First Published:  27 Feb 2019 1:31 AM IST
Next Story