Telugu Global
NEWS

కుంభకోణం బట్టబయలు... అల్లు శిరీష్‌కు నోటీసులు

మరో మల్టీ లెవల్ మార్కెటింగ్‌ కుంభకోణం బయటపడింది. క్యూనెట్ పేరుతో దాదాపు మూడు లక్షల మందిని ముంచేశారు. క్యూనెట్ స్కాంలో కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు 500 మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో సినీ ప్రముఖులున్నారు. షారుక్‌ ఖాన్, పూజా హెగ్డే, బొమన్‌ ఇరానీ, అల్లు శిరీష్‌లు కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. హాంగ్‌ కాంగ్‌కు చెందిన క్యూఐ కంపెనీ క్యూనెట్‌ పేరుతో పొంజి కుంభకోణానికి పాల్పడింది. వేల కోట్లు […]

కుంభకోణం బట్టబయలు... అల్లు శిరీష్‌కు నోటీసులు
X

మరో మల్టీ లెవల్ మార్కెటింగ్‌ కుంభకోణం బయటపడింది. క్యూనెట్ పేరుతో దాదాపు మూడు లక్షల మందిని ముంచేశారు. క్యూనెట్ స్కాంలో కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు 500 మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో సినీ
ప్రముఖులున్నారు. షారుక్‌ ఖాన్, పూజా హెగ్డే, బొమన్‌ ఇరానీ, అల్లు శిరీష్‌లు కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

హాంగ్‌ కాంగ్‌కు చెందిన క్యూఐ కంపెనీ క్యూనెట్‌ పేరుతో పొంజి కుంభకోణానికి పాల్పడింది. వేల కోట్లు వసూలు చేసి మోసం చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్నాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో దాదాపు మూడు లక్షల మంది ఈ క్యూనెట్ బారిన పడి మోసపోయారు. ఇప్పటికే 60 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నోటీసులు అందుకున్న ప్రముఖులు మార్చి 4న తమ ముందు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. లేని పక్షంలో న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రముఖులంతా క్యూనెట్‌ వద్ద భారీగా రెమ్యునరేషన్ తీసుకుని కంపెనీని ప్రమోట్ చేయడం ద్వారా సామాన్యులను దెబ్బతీశారు.

First Published:  27 Feb 2019 1:58 AM IST
Next Story