Telugu Global
NEWS

వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్న ఆంధ్రా నయీం...

గుంటూరు జిల్లాకు చెందిన వివాదాస్పద టీడీపీ ముఖ్యనేత కుమారుడు మరోసారి పంజా విసురుతున్నారు. నాలుగున్నరేళ్లలో ప్రతి పనికి, చివరకు ఇల్లు కట్టుకునే వారి నుంచి, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి వరకూ డబ్బులు వసూలు చేసి వేల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయినా ఆయన ఆత్మశాంతించడం లేదు. ఇప్పుడు ఎన్నికల ఖర్చు కోసం వ్యాపారుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. గుంటూరులోని ఒక టూవీలర్ బైక్స్‌ షోరూంలో ముఖ్యనేత కుమారుడు రెండు రోజులుగా వరుసగా వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి వ్యాపారం బట్టి […]

వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్న ఆంధ్రా నయీం...
X

గుంటూరు జిల్లాకు చెందిన వివాదాస్పద టీడీపీ ముఖ్యనేత కుమారుడు మరోసారి పంజా విసురుతున్నారు. నాలుగున్నరేళ్లలో ప్రతి పనికి, చివరకు ఇల్లు కట్టుకునే వారి నుంచి, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి వరకూ డబ్బులు వసూలు చేసి వేల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయినా ఆయన ఆత్మశాంతించడం లేదు. ఇప్పుడు ఎన్నికల ఖర్చు కోసం వ్యాపారుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు.

గుంటూరులోని ఒక టూవీలర్ బైక్స్‌ షోరూంలో ముఖ్యనేత కుమారుడు రెండు రోజులుగా వరుసగా వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి వ్యాపారం బట్టి చందాలు రాయించుకుంటున్నారు. లక్షకు తగ్గకుండా ప్రతి వ్యాపారి వద్ద చందా రాయించుకుని పంపుతున్నారు. బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లను కూడా షోరూం మీటింగ్‌కు పిలిపిస్తున్నారు. కొందరి వద్ద కోటి రూపాయల వరకు చందాలు రాయించుకున్నారు.

ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చందాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యనేత కుమారుడు ఒత్తిడి తెస్తున్నారు. చందాలు రాసి వెళ్లడం కాదు… వీలైనంత త్వరగా ఆ సొమ్మును చెల్లించి రసీదు తీసుకెళ్లాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నాడు ముఖ్యనేత కుమారుడు. ”కే” వారసుడు ఇంతకాలం వసూలు చేసింది కాకుండా ఇప్పుడు ఎన్నికల ఖర్చు కోసం మరోసారి చందాలు వసూలు చేస్తున్నారన్న విషయం తెలుసుకుని తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారు కూడా భయపడిపోతున్నారు. తమ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తారేమో అని చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ చందాలు సత్తెనపల్లికి సంబంధించిన వారి నుంచి వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట వ్యాపారులు తమ నుంచి కూడా ”కే” వారసుడు డబ్బులు వసూలు చేస్తాడేమో అని భయపడుతున్నారు. ఇన్నాళ్లు
దోచిన వేల కోట్లు చాలవన్నట్టు ఇప్పుడు ఎన్నికల ఖర్చు కూడా జనం నుంచి వసూలు చేయడం చూసి… తాము ఏ పాపం చేసుకున్నామని రెండు నియోజకవర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

First Published:  27 Feb 2019 2:30 AM IST
Next Story