పాక్ అదుపులో భారత పైలెట్..!
భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్ పైలెట్ ఒకరిని అదుపులోనికి తీసుకున్నట్లు పాకిస్తాన్ చెబుతోంది. ఇవాళ ఉదయం పీవోకేలో దాడుల కోసం బయలు దేరిన మిగ్ విమానం ఒకటి గల్లంతు అయినట్లు భారత విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. మరోవైపు భారత వాయు సేనకు చెందిన ఇద్దరు పైలెట్లను పీవోకేలో అదుపులోనికి తీసుకున్నామని చెబుతోంది. వారిలో ఒక పైలెట్ అయిన అభినందన్‌కు చెందిన వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. మొఖానికి బట్టను చుట్టి ఉన్నట్లు ఈ వీడియోలో […]
భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్ పైలెట్ ఒకరిని అదుపులోనికి తీసుకున్నట్లు పాకిస్తాన్ చెబుతోంది. ఇవాళ ఉదయం పీవోకేలో దాడుల కోసం బయలు దేరిన మిగ్ విమానం ఒకటి గల్లంతు అయినట్లు భారత విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది.
మరోవైపు భారత వాయు సేనకు చెందిన ఇద్దరు పైలెట్లను పీవోకేలో అదుపులోనికి తీసుకున్నామని చెబుతోంది. వారిలో ఒక పైలెట్ అయిన అభినందన్‌కు చెందిన వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. మొఖానికి బట్టను చుట్టి ఉన్నట్లు ఈ వీడియోలో కనపడుతోంది. మరో పైలెట్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పాకిస్తాన్ వెల్లడించింది.
వీడియోలో చూపిస్తున్న అభినందన్ కేరళకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అతని సర్వీస్ నెంబర్ 27981 అని ఆ వీడియోలో కనపడుతోంది. అభినందన్‌ను పూర్తిగా కట్టేసి ఉన్నస్థితిలో కనిపిస్తున్నాడు. అతడి నుంచి పలు వివరాలు సేకరిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే తప్పిపోయిన పైలెట్ అభినందనే అని భారత ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు.
అభినందన్ త్వరగా భారత్‌కు క్షేమంగా తిరిగి రావాలని పలువురు కోరుకుంటున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సామాజిక మాధ్యమాల్లో అభినందన్ తిరిగి రావాలని కోరుకున్నారు.
The arrested Indian pilot #PakistanArmyZindabad#Budgam#PakistanAirForceOurPride#PakistanStrikesBack#PakistanZindabaad pic.twitter.com/UIPHFBv2Sk
— Radio Pakistan (@RadioPakistan) February 27, 2019