Telugu Global
National

వైమానిక దాడులపై భారత్‌ అధికారిక ప్రకటన ఇది...

పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దళాలు చేసిన దాడిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖల్‌ మీడియా ముందుకొచ్చి దాడి వివరాలను వెల్లడించారు. రెండేళ్ళుగా పాక్‌ కేంద్రంగా జేషేఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ క్రియాశీలంగా పనిచేస్తోందని గోఖలే వివరించారు. తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని గతంలో చెప్పిన పాక్ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. పీవోకేలో వందలాది ఉగ్రశిబిరాలు ఉన్నాయని.. పక్కా సమాచారంతోనే దాడులు చేసినట్టు గోఖలే వివరించారు. […]

వైమానిక దాడులపై భారత్‌ అధికారిక ప్రకటన ఇది...
X

పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దళాలు చేసిన దాడిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖల్‌ మీడియా ముందుకొచ్చి దాడి వివరాలను వెల్లడించారు.

రెండేళ్ళుగా పాక్‌ కేంద్రంగా జేషేఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ క్రియాశీలంగా పనిచేస్తోందని గోఖలే వివరించారు. తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని గతంలో చెప్పిన పాక్ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. పీవోకేలో వందలాది ఉగ్రశిబిరాలు ఉన్నాయని.. పక్కా సమాచారంతోనే దాడులు చేసినట్టు గోఖలే వివరించారు.

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. దాడుల్లో జైషే ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. డ్రోన్ కెమెరాలతో లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి దాడులు చేశామని చెప్పారు.

బహవల్‌పూర్‌ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ వరుసగా భారత్‌పై దాడులు చేస్తోందని… అందుకే వైమానిక దాడులు చేయాల్సి వచ్చిందన్నారు. నిఘా వర్గాల సమాచారంతో సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా నిర్దేశిత ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామన్నారు.

First Published:  26 Feb 2019 7:10 AM IST
Next Story