Telugu Global
NEWS

వెంటాడుతున్న గతం... జలీల్‌ఖాన్ కుమార్తె పై ఫత్వా జారీ...

విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు. గతంలో ప్రత్యర్థులపై ప్రయోగించిన అస్త్రం ఇప్పుడు ఆయన కుమార్తెను చిక్కుల్లోకి నెట్టింది. ముస్లిం మత పెద్దలు ఏకంగా జలీల్ ఖాన్ కుమార్తె షబానాపై ఫత్వా జారీ చేశారు. 2009 ఎన్నికల్లో మాజీ మేయర్ మల్లికా బేగం కాంగ్రెస్ టికెట్‌ సాధించారు. దాంతో ఆగ్రహించిన జలీల్‌ ఖాన్ మత పెద్దలను అప్పట్లో ఆశ్రయించారు. బురఖా తీసేసి మల్లికా బేగం ప్రచారంలో పాల్గొన్నారని… ఇది ఇస్లాంకు విరుద్దమని కాబట్టి ఆమెపై ఫత్వా జారీ చేయాలని కోరారు. […]

వెంటాడుతున్న గతం... జలీల్‌ఖాన్ కుమార్తె పై ఫత్వా జారీ...
X

విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు. గతంలో ప్రత్యర్థులపై ప్రయోగించిన అస్త్రం ఇప్పుడు ఆయన కుమార్తెను చిక్కుల్లోకి నెట్టింది. ముస్లిం మత పెద్దలు ఏకంగా జలీల్ ఖాన్ కుమార్తె షబానాపై ఫత్వా జారీ చేశారు.

2009 ఎన్నికల్లో మాజీ మేయర్ మల్లికా బేగం కాంగ్రెస్ టికెట్‌ సాధించారు. దాంతో ఆగ్రహించిన జలీల్‌ ఖాన్ మత పెద్దలను అప్పట్లో ఆశ్రయించారు. బురఖా తీసేసి మల్లికా బేగం ప్రచారంలో పాల్గొన్నారని… ఇది ఇస్లాంకు విరుద్దమని కాబట్టి ఆమెపై ఫత్వా జారీ చేయాలని కోరారు. దాంతో అప్పట్లో ముస్లిం మత పెద్దలు కూడా మల్లికా బేగానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. ఆ ఫత్వా
వల్లే తాను ఓడిపోయానని అప్పట్లో మల్లికా బేగం ఆవేదన చెందారు.

ఇప్పుడు సరిగ్గా అదే ఇబ్బంది జలీల్ ఖాన్ కుమార్తె షబానాకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తండ్రి స్థానంలో విజయవాడ నుంచి పోటీ చేసేందుకు షబానా సిద్దమయ్యారు. టికెట్ కూడా దాదాపు ఓకే అయింది. దాంతో ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆమె కూడా బురఖా లేకుండానే ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో గతంలో ఫత్వాను ఎదుర్కొన్న మల్లికా బేగం… విజయవాడలోని మత పెద్దలను నిలదీశారు.

గతంలో తాను బురఖా లేకుండా ప్రచారం చేశానని ఫత్వా జారీ చేశారని.. మరి ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తెపై ఎందుకు ఫత్వా జారీ చేయలేదని నిలదీశారు. దీంతో మతపెద్దలు తమకు అందరూ సమానమే అని ప్రకటించి జలీల్‌ ఖాన్ కుమార్తె షబానాపై ఫత్వా జారీ చేశారు.

ఈ ఫత్వాపై జలీల్ ఖాన్‌ గతానికి భిన్నంగా స్పందించారు. 2009 నాటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరని చెబుతున్నారు. ప్రపంచమే మారుతోందని కాబట్టి ఇప్పుడు తన కుమార్తె బురఖా లేకుండా ప్రచారంలో పాల్గొనడంలో తప్పులేదంటున్నారు. అయితే మతపెద్దలు ఫత్వా జారీ చేసిన నేపథ్యంలో జలీల్ ఖాన్ కుమార్తెకు ముస్లింలు ఓటేసే అవకాశం లేదంటున్నారు.

First Published:  26 Feb 2019 2:44 AM IST
Next Story