Telugu Global
NEWS

సిట్టింగుల సీట్లకు.... ఫిరాయింపు దారుల ఎసరు

పాణ్యం అసెంబ్లీ నియోజక వర్గంలో ఆసక్తిదాయకమైన రాజకీయం సాగుతూ ఉంది. పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కొన్నాళ్ల కిందట అక్కడ పార్టీలో చేరిన రాంభూపాల్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కవచ్చని వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో గౌరు చరిత అలక వహించారట. ఆమె భర్తతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటానికి రెడీ అవుతున్నారట. వైఎస్ కుటుంబం గౌరు కుటుంబానికి ఎంతో […]

సిట్టింగుల సీట్లకు.... ఫిరాయింపు దారుల ఎసరు
X

పాణ్యం అసెంబ్లీ నియోజక వర్గంలో ఆసక్తిదాయకమైన రాజకీయం సాగుతూ ఉంది. పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి.

కొన్నాళ్ల కిందట అక్కడ పార్టీలో చేరిన రాంభూపాల్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కవచ్చని వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో గౌరు చరిత అలక వహించారట. ఆమె భర్తతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటానికి రెడీ అవుతున్నారట.

వైఎస్ కుటుంబం గౌరు కుటుంబానికి ఎంతో సాయం చేసింది. చరిత భర్త కోసం వైఎస్ చాలా అండగా నిలబడ్డారు. అయితే ఇప్పుడు గౌరు కుటుంబీకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారట. రాంభూపాల్ రెడ్డికి వైసీపీ టికెట్ ఖరారు అనే వార్తల నేపథ్యంలో గౌరు కుటుంబం ఆ పార్టీని వీడటం కూడా ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

ఆమె తెలుగుదేశం పార్టీలో చేరితే.. టికెట్ ఖాయమని కూడా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నుంచి ఈ మేరకు అనధికారిక హామీ వెళ్లిందట. దీంతో గౌరు చరిత తెలుగుదేశం కండువా కప్పుకోవడం ఖాయమని సమాచారం.

ఈ నేపథ్యంలో ఏరాసు ప్రతాపరెడ్డి అలక వహిస్తున్నాడని టాక్. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏరాసు పాణ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇలాంటి నేపథ్యంలో.. ఈ సారి గౌరు చరితకు టీడీపీ టికెట్ దక్కుతుందనే ప్రచారంతో ఏరాసు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం!

First Published:  26 Feb 2019 12:18 PM IST
Next Story