పార్టీ ఫిరాయింపులు.... ఈరోజు నుంచి మళ్ళీ మొదలు
” జగన్ రావాలి… మంచి జరగాలి…” ఇది నిన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన నినాదం. అయితే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మాత్రం నినాదాన్ని మారుస్తున్నారు. తన కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్లిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తిరిగి రాగానే ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని కొందరు తహతహలాడుతున్నారు. ఎన్నికలకు ముందే అభ్యర్ధులను ప్రకటిస్తున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, […]
” జగన్ రావాలి… మంచి జరగాలి…” ఇది నిన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన నినాదం. అయితే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మాత్రం నినాదాన్ని మారుస్తున్నారు. తన కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్లిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తిరిగి రాగానే ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని కొందరు తహతహలాడుతున్నారు.
ఎన్నికలకు ముందే అభ్యర్ధులను ప్రకటిస్తున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పత్రికలకు లీకుల మీద లీకులు ఇస్తున్నారు. సిట్టింగ్ శాసనసభ్యుల్లో 50 శాతం మందికి పైగా మారుస్తామని మూడు నెలలుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నట్లు వార్తలు వదులుతున్నారు.
దీంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
గడచిన వారం రోజులుగా చంద్రబాబు నాయుడు కృష్ణా, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన పార్టీ నాయకులు, శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సమావేశం అనంతరం కొన్ని పేర్లను రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులుగా లీకులు వదులుతూ కార్యకర్తల్లోను, నాయకుల్లోనూ గందరగోళం సృష్టిస్తున్నారు.
దీంతో అసహనానికి గురవుతున్నారు తెలుగుదేశం నాయకులు. కార్యకర్తలు పార్టీని వీడి చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని ఎక్కడికక్కడ తీర్మానించుకుంటున్నట్లు సమాచారం. లండన్ పర్యటన నుంచి జగన్ తిరిగి రాగానే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు సహా అనేక జిల్లాల నుంచి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇప్పటికే వైయస్సార్ పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్న తెలుగుదేశం నాయకులు జగన్ రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. గడచిన వారం రోజుల పాటు వలసలకు సెలవులు ప్రకటించిన తెలుగు తమ్ముళ్ళు రామన్న పది, పదిహేను రోజులలో భారీ ఎత్తున పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు.