Telugu Global
International

సర్వసన్నద్ధమైన భారత సైన్యం... మోహరించిన యుద్ధ విమానాలు

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో పరిణామాలు చకచక మారుతున్నాయి. సరిహద్దు వెంబడి యుద్ధ మేఘాలు అలముకున్నాయి. వైమానిక దాడులు చేసిన భారత్ ఆ వెంటనే సరిహద్దుల వెంబడి సైన్యాన్ని అప్రమత్తం చేసింది. యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచారు.  పాకిస్థాన్‌ ఒకవేళ ప్రతికార దాడులకు దిగితే తిప్పికొట్టేందుకు సైన్యం, వైమానిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. పంజాబ్ సరిహద్దుల్లో ప్రజలను కూడా భారత సైన్యం అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు […]

సర్వసన్నద్ధమైన భారత సైన్యం... మోహరించిన యుద్ధ విమానాలు
X

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో పరిణామాలు చకచక మారుతున్నాయి. సరిహద్దు వెంబడి యుద్ధ మేఘాలు అలముకున్నాయి. వైమానిక దాడులు చేసిన భారత్ ఆ వెంటనే సరిహద్దుల వెంబడి సైన్యాన్ని అప్రమత్తం చేసింది. యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచారు.

పాకిస్థాన్‌ ఒకవేళ ప్రతికార దాడులకు దిగితే తిప్పికొట్టేందుకు సైన్యం, వైమానిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. పంజాబ్ సరిహద్దుల్లో ప్రజలను కూడా భారత సైన్యం అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరోవైపు వైమానిక దాడుల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్‌, సుష్మాస్వరాజ్‌, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భారత వైమానిక దాడుల్లో ఐదుగురు పాక్‌ సైనికులు కూడా చనిపోయారు. వారి మృతదేహాలను బాలకోట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అయితే పాక్‌ మాత్రం దాడులు నిజమే గానీ… ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటోంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దాడులు చేయడం మన భూభాగం పరిధిలోకి వస్తుందని ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఈ దాడులను భారత్‌ ఆత్మరక్షణ కోసం చేసినట్టుగానే అంతర్జాతీయ సమాజం భావించాల్సి ఉంటుందన్నారు. ఈ దాడుల ద్వారా భారత్ ఎలాంటి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు పాల్పడలేదన్నారు.

First Published:  26 Feb 2019 6:25 AM IST
Next Story