ఈ రూల్ తలసాని యాదవ్‌కు మాత్రమే... పరిటాల వారికి వర్తించదు...
ఆంధ్రప్రదేశ్‌లో చట్టం అధికార పార్టీతో చుట్టరికం కలుపుకుని చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. సామాన్యుల పట్ల, ఇతర పార్టీల నేతల విషయంలో చట్టం చాలా కఠినంగా ఉంటోంది… అదే అధికార పార్టీ నేతల విషయానికి వచ్చే సరికి చట్టం సలాం కొట్టి సైలెంట్ అవుతోంది. చివరకు ప్రముఖ దేవాలయాల వద్ద కూడా ఈ వివక్ష కొనసాగుతోంది. ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ వచ్చారు. ఆ సమయంలో ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి కాస్త దూరం వెళ్లిన తర్వాత మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి చంద్రబాబు పాలనపై […]
ఆంధ్రప్రదేశ్‌లో చట్టం అధికార పార్టీతో చుట్టరికం కలుపుకుని చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. సామాన్యుల పట్ల, ఇతర పార్టీల నేతల విషయంలో చట్టం చాలా కఠినంగా ఉంటోంది… అదే అధికార పార్టీ నేతల విషయానికి వచ్చే సరికి చట్టం సలాం కొట్టి సైలెంట్ అవుతోంది. చివరకు ప్రముఖ దేవాలయాల వద్ద కూడా ఈ వివక్ష కొనసాగుతోంది.
ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ వచ్చారు. ఆ సమయంలో ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి కాస్త దూరం వెళ్లిన తర్వాత మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి చంద్రబాబు పాలనపై అభిప్రాయం కోరారు. దీంతో చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
దాంతో చంద్రబాబుకు కోపం వచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆలయంలో మర్యాదలు చేయడంపై మండిపడ్డారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీకి వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి కూడా వీల్లేదని… పార్టీలోని యాదవ సామాజిక వర్గం నేతలను చంద్రబాబు హెచ్చరించారు.
ఆలయ పాలకమండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబుతో ప్రెస్‌మీట్ పెట్టించింది. ఆలయం వద్ద రాజకీయాలు మాట్లాడడం ఏమిటని తలసానిని ప్రశ్నింపచేశారు. మరెవరూ ఆలయం వద్ద రాజకీయాలు మాట్లాడడానికి వీల్లేదని ఆలయం తరపున ప్రకటన ఇప్పించారు.
అయితే మంత్రి పరిటాల సునీత మాత్రం ఆలయ నిబంధనను తొక్కేశారు. తన నియోజకవర్గ కార్యకర్తలను బస్సులో తీసుకొచ్చిన ఆమె వారికి దుర్గమ్మ దర్శనం చేయించారు. మంత్రి మనుషులు కావడంతో ఆలయ సిబ్బంది కూడా అన్ని మర్యాదలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన పరిటాల సునీత… ఆలయం వద్దే రాజకీయ ప్రసంగం చేశారు.
చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. టీడీపీనే మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునే మళ్లీ గెలిపించాలన్నారు.
నిబంధనలకు విరుద్దంగా మంత్రి ఇలా ఆలయం వద్దే రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నా సిబ్బంది మాత్రం అడ్డు చెప్పలేదు. మంత్రి కదా మనకెందుకులే అంటూ చట్టంలోని చుట్టరికం పార్ట్‌ను ప్రయోగించారు. ఇదెక్కడి న్యాయం అని ధార్మిక సంఘాలు ప్రశ్నించగా… సిబ్బంది కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు.