Telugu Global
NEWS

ఈ సృష్టిలో ఐదో వింత జంతువు చంద్రబాబు

చంద్రబాబు తీరు చూస్తుంటే సృష్టిలో ఐదో వింత జంతువు కూడా ఉందన్న భావన కలుగుతోందన్నారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. నిన్న ఒక మాట, నేడు ఒక మాట, రేపు ఒక మాట చెబుతూ బతుకుతున్నారన్నారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు మాట మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. 400 కోట్లు పెట్టి పోలవరం వద్దకు సందర్శకులను తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని హోదాలో దేవేగౌడ పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోండి నిధులు ఇస్తామని చెబితే వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ […]

ఈ సృష్టిలో ఐదో వింత జంతువు చంద్రబాబు
X

చంద్రబాబు తీరు చూస్తుంటే సృష్టిలో ఐదో వింత జంతువు కూడా ఉందన్న భావన కలుగుతోందన్నారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. నిన్న ఒక మాట, నేడు ఒక మాట, రేపు ఒక మాట చెబుతూ బతుకుతున్నారన్నారు. ప్రతి అంశంలోనూ

చంద్రబాబు మాట మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. 400 కోట్లు పెట్టి పోలవరం వద్దకు సందర్శకులను తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని హోదాలో దేవేగౌడ పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోండి నిధులు ఇస్తామని చెబితే వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో తనపై ఇష్టానుసారం రాశారని మండిపడ్డారు. చంద్రబాబును చూసి తాను అసూయ పడుతున్నట్టుగా రాధాకృష్ణ రాశారన్నారు. తనకు చంద్రబాబు మీద అసూయ లేదని.. అతడిని చూస్తే జాలిగా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా… తనలా ఆయన ఆనందంగా లేరన్నారు. చంద్రబాబు మోసాలపై సోషల్ మీడియాలో జనం ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారని…. వాటిని తట్టుకుని చంద్రబాబు తప్ప మరొకరైతే ముఖ్యమంత్రి సీట్లో ఒక్క నిమిషం కూడా కూర్చోలేరన్నారు.

చంద్రబాబును కలిసిన జాతీయ నేతలు పక్కకు వచ్చి చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారన్నారు. ఈయన ఇంగ్లీష్ చూసి నవ్వుకుంటున్నారన్నారు. చివరకు అధికారులు, టీడీపీ నేతలు కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లు భరించలేక తిట్టుకుంటున్నారన్నారు. చంద్రబాబు తమ జిల్లాకు 90 సార్లు వచ్చారని… వచ్చినప్పుడల్లా డ్వాక్రా మహిళలను బస్సుల్లో తరలించే పనితోనే తన కాలం గడిచిపోతోందని ఒక కలెక్టర్ తన వద్ద వాపోయారన్నారు.

చంద్రబాబు ప్రతి మీటింగ్‌లోనూ ఒకే ప్రసంగం చేస్తుండడంతో నిద్ర వస్తోందని అధికారులు చెబుతున్నారన్నారు. నిద్రలో నుంచి మెలుకువ రాగానే ప్రస్తుత మీటింగ్‌లో ఉన్నామా లేక గత మీటింగ్‌లో ఉన్నామా అన్న భావనకు అధికారులు లోనవుతున్నారన్నారు.

ఏపీలో ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు… ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని విమర్శించారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పిలిచి కాంట్రాక్టులు ఇస్తాం పార్టీలో ఉండండి అని ఇంటెలిజెన్స్ ఐజీ ఒప్పందాలు చేస్తున్నారని చెప్పారు.

టీడీపీ ఆవిర్భావం నాడు చేసిన రాజకీయ తీర్మానంలోనే ఏ ఎమ్మెల్యే అయినా పార్టీలోకి రావాలనుకుంటే ముందుగా ఆ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని స్పష్టంగా ఉందన్నారు. కానీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాత్రం టీడీపీ మూల సిద్ధాంతాలకే తూట్లు పొడుస్తున్నారన్నారు.

ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా చర్యలు తీసుకోలేదన్నారు. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను
కొనుక్కున్నారని కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా ఈ విషయం తనకు చెప్పారన్నారు. ఇలా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న చంద్రబాబు తిరిగి వ్యవస్థలు నాశనం అవుతున్నాయని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.

పవిత్రమైన జర్నలిజాన్ని ఏబీఎన్ రాధాకృష్ణ నాశనం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టులో కూడా రాధాకృష్ణకు కమిషన్‌ అందలేదా అని నిలదీశారు. ప్రతి కాంట్రాక్టులోనూ రాధాకృష్ణ కమిషన్ తీసుకుంటున్నారని చెప్పారు.

జర్నలిజం వ్యవస్థను నాశనం చేసిన విధానం రాష్ట్రంలో పరాకాష్టకు చేరిందన్నారు. ఈ దారుణాలన్నీ చూసే చంద్రబాబును సృష్టిలో ఐదో వింత జంతువుగా తాను గుర్తిస్తున్నానని చెప్పారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తాను గ్రామాల్లో తిరుగుతున్నానని… ప్రతి రైతు గిట్టుబాట ధర లేక ఎకరాకు 15 నుంచి 25 వేల వరకు పంటను బట్టి నష్టపోతున్నారన్నారు. అలాంటి రైతుల చేతుల్లో పోస్టు డేటెడ్ చెక్‌లు పెట్టి మోసం చేస్తున్నారన్నారు.

జగన్‌ ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్ల పాటు ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు జగన్‌ పథకాలను కాపీ కొడుతూ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు.

డ్వాక్రా మహిళలకు గతంలో చెప్పిన వడ్డీ రాయితీనే ఆరు వేల కోట్లు రావాల్సి ఉందని… కానీ దాన్ని చెల్లించకుండా ఇప్పుడు పసుపు-కుంకుమ అంటూ తక్కువ మొత్తాన్ని జమ చేస్తున్నారన్నారు.

First Published:  26 Feb 2019 7:12 AM IST
Next Story