పోటీకి భయపడ్డ టీడీపీ
ఏపీలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల, ఉత్తరాంధ్ర టీచర్స్ నియోజకవర్గాలకి నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. వీటితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి కూడా ఎన్నిక జరుగుతుంది. వచ్చే నెల 22న పోలింగ్ నిర్వహిస్తారు. అయితే పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. సాధారణ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే ఉండడంతో ఈ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే, […]
ఏపీలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల, ఉత్తరాంధ్ర టీచర్స్ నియోజకవర్గాలకి నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. వీటితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి కూడా ఎన్నిక జరుగుతుంది. వచ్చే నెల 22న పోలింగ్ నిర్వహిస్తారు.
అయితే పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. సాధారణ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే ఉండడంతో ఈ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఫలితం తేడాగా వస్తే దాని ప్రభావం సాధారణ ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని టీడీపీ భయపడుతోంది.
గతంలో రాయలసీమ ప్రాంత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగకుండా… ఏదో ఒక సంఘానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకుంది.
అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే స్థానిక ఎమ్మెల్యేలంతా ఆ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని…. అలా చేయడం వల్ల సాధారణ ఎన్నికలపై వారు ఫోకస్ పెట్టేందుకు వీలుండదని…. అందుకే ఈ ఎన్నికలకు పార్టీ దూరంగా ఉంటోందని టీడీపీ చెబుతోంది.