Telugu Global
National

కాంగ్రెస్‌కు మళ్లీ ఝలక్.... మరో రెండు రాష్ట్రాల్లో జట్టు కట్టిన ఎస్పీ, బీఎస్పీ..!

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారంలోనికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు. కాగా, రాహుల్ ఆశలపై నీళ్లు చల్లేలా బీఎస్పీ, ఎస్పీ అధినేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్ సొంతంగా కూటమిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో కలసి పోటీ చేస్తామని ప్రకటించిన ఈ కూటమి మరో […]

కాంగ్రెస్‌కు మళ్లీ ఝలక్.... మరో రెండు రాష్ట్రాల్లో జట్టు కట్టిన ఎస్పీ, బీఎస్పీ..!
X

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారంలోనికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు. కాగా, రాహుల్ ఆశలపై నీళ్లు చల్లేలా బీఎస్పీ, ఎస్పీ అధినేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్ సొంతంగా కూటమిని ఏర్పాటు చేశారు.

ఇప్పటికే యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో కలసి పోటీ చేస్తామని ప్రకటించిన ఈ కూటమి మరో రెండు రాష్ట్రాల్లో కూడా సీట్ల సర్థుబాటు చేసుకున్నట్లు ఇవాళ ప్రకటించింది.

ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల తర్వాత అధికారంలోనికి వచ్చింది. బీఎస్పీతో కలిసి పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంది. అయితే అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి ఎస్పీతో జతకట్టింది. మొత్తం 29 సీట్లకుగాను 26 సీట్లలో బీఎస్పీ, మిగిలిన మూడు సీట్లలో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2014లో రెండు సీట్లు మినహా అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

ఇక ఉత్తరాఖండ్‌లోని 5 ఎంపీ స్థానాలకు గాను నాలుగు స్థానాల్లో బీఎస్పీ, ఒక స్థానంలో ఎస్పీ పోటీ చేసేలా అవగాహనకు వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ అన్ని సీట్లను బీజేపీ ఖాతాలో చేరాయి.

ఇలా ముఖ్యమైన రాష్ట్రాల్లో బీఎస్పీ, ఎస్పీ పొత్తులు కుదుర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేస్తున్నాయి. యూపీలో కూడా రాహుల్, సోనియాలు పోటీ చేసే అమేథి, రాయ్ బరేలీ మినహా మిగతా సీట్లలో తామే పోటీ చేయనున్నట్లు ఈ రెండు పార్టీలు ప్రకటించాయి.

మరి ఈ రెండు పార్టీల సర్థుబాటు మహాకూటమికి ఎంత నష్టం చేకూర్చనుందో కాలమే నిర్ణయిస్తుంది.

First Published:  25 Feb 2019 12:56 PM IST
Next Story