Telugu Global
NEWS

ఏపీలో రేణూదేశాయ్ పర్యటన.... మర్మం ఏమిటి?

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూదేశాయ్ ఏపీలో పర్యటిస్తుండటం ఆసక్తిదాయకంగా మారింది. ఏదో రాజకీయ ఆసక్తితోనే.. ఆమె ఏపీలో పర్యటిస్తూ ఉందనే ప్రచారం జరుగుతూ ఉంది. అది కూడా ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రజల కష్టాలను, కడగండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. రైతులతో మాట్లాడుతూ ఉంది. అంతకు మించిన విశేషం.. రేణూదేశాయ్ ఏపీ పర్యటనను ప్రోగ్రామ్ గా మార్చి ‘సాక్షి’ టీవీ వాళ్లు కార్యక్రమంగా ప్రసారం చేయడం ఆసక్తిదాయకంగా మారింది. పవన్ కల్యాణ్ మాజీ […]

ఏపీలో రేణూదేశాయ్ పర్యటన.... మర్మం ఏమిటి?
X

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూదేశాయ్ ఏపీలో పర్యటిస్తుండటం ఆసక్తిదాయకంగా మారింది. ఏదో రాజకీయ ఆసక్తితోనే.. ఆమె ఏపీలో పర్యటిస్తూ ఉందనే ప్రచారం జరుగుతూ ఉంది. అది కూడా ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రజల కష్టాలను, కడగండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. రైతులతో మాట్లాడుతూ ఉంది. అంతకు మించిన విశేషం.. రేణూదేశాయ్ ఏపీ పర్యటనను ప్రోగ్రామ్ గా మార్చి ‘సాక్షి’ టీవీ వాళ్లు కార్యక్రమంగా ప్రసారం చేయడం ఆసక్తిదాయకంగా మారింది.

పవన్ కల్యాణ్ మాజీ భార్య అయ్యాక అనేక విషయాల గురించి రేణూ దేశాయ్ ఓపెన్ గా మాట్లాడింది. పవన్ కల్యాణ్ తనను ఎలా మోసం చేశాడో ఆమె వివరించింది. తనతో విడాకులు తీసుకోక ముందే.. పవన్ కల్యాణ్ మరొక ఆమెతో ప్రేమాయణాన్ని నడిపించాడని…. తమ విడాకులకు ముందే ఆమె గర్భవతి అని రేణూదేశాయ్ వివరించింది.

అలాంటి వ్యక్తితో ఎలా కలిసి ఉండమంటారంటూ అప్పట్లో రేణూ ప్రశ్నించింది. పవన్ తో విడాకుల అనంతరం ఆమె వేరే పెళ్లి చేసుకోబోయే విషయంలో కూడా ఈ హీరో అభిమానులు రేణూ దేశాయ్ మీద విరుచుకుపడ్డారు. ఆమె మరో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆమె పై వార్ ప్రకటించారు. ఆమెను దూషించడానికి కూడా కొంతమంది వెనుకాడలేదు.

అదంతా జరిగిపోయిన పక్షంలో ఇప్పుడు రేణూ దేశాయ్ అనూహ్యంగా ఏపీలో పర్యటిస్తూ ఉంది. అది కూడా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆమె ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. మరి ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుంది? వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష పోటీకి రెడీ అవుతున్న నేపథ్యంలో…. ఈ కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తిదాయకంగా మారింది!

First Published:  25 Feb 2019 10:52 AM IST
Next Story