Telugu Global
NEWS

వైసీపీ ఎప్పుడు పాలించింది రఘువీరా?

ఆంధ్రప్రదేశ్‌ను దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యాత్ర చేసిన రఘువీరారెడ్డి రాష్ట్రానికి చంద్రగ్రహణం(చంద్రబాబు), సూర్యగ్రహణం( జగన్‌) పట్టాయని అవి వీడాల్సిన అవసరం ఉందన్నారు. హోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని… కాబట్టి తమకే ఓటేయాలని కోరారు. అయితే రఘువీరా ఇక్కడో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఈ రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీనే పాలించాలా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏమైనా టీడీపీ, వైసీపీ జాగీరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా టీడీపీ, వైసీపీ వాళ్లే […]

వైసీపీ ఎప్పుడు పాలించింది రఘువీరా?
X

ఆంధ్రప్రదేశ్‌ను దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యాత్ర చేసిన రఘువీరారెడ్డి రాష్ట్రానికి చంద్రగ్రహణం(చంద్రబాబు), సూర్యగ్రహణం( జగన్‌) పట్టాయని అవి వీడాల్సిన అవసరం ఉందన్నారు.

హోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని… కాబట్టి తమకే ఓటేయాలని కోరారు. అయితే రఘువీరా ఇక్కడో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఈ రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీనే పాలించాలా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏమైనా టీడీపీ, వైసీపీ జాగీరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా టీడీపీ, వైసీపీ వాళ్లే పాలించాలా? అని రఘువీరా మండిపడ్డారు.

ఎప్పుడూ టీడీపీనే పాలించాలా అంటే కాస్త అర్థముంది. కానీ వైసీపీని ఆ గాటన కట్టడమే కాస్త విచిత్రం. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు వైసీపీ అధికారంలోకి ఒక్కసారి కూడా రాలేదు కదా!. పైగా చంద్రబాబు కంటే ముందు పదేళ్లు పాలించింది రఘువీరారెడ్డి పార్టీనే. బహుశా… వైఎస్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కోటాను కూడా వైసీపీ ఖాతాలో కలిపేశారు రఘువీరా.

అదే రఘువీరా ఆలోచన అయితే వైఎస్‌… కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని ఇంతకాలం చెప్పిన మాటలు ఉత్తిత్తి పలుకులే అనుకోవాలా? అని అంటున్నారు. ఏంటో ప్రతిపక్షంలో ఉన్నా సరే వైసీపీని అధికార పార్టీగా గుర్తించేస్తున్నారు.

గతంలో చంద్రబాబు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు రఘువీరా కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారు.

First Published:  25 Feb 2019 2:41 AM IST
Next Story