Telugu Global
Health & Life Style

పచ్చి ఉల్లిపాయ ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు...!

ఉల్లిపాయలేని కూర ఉంటుందా? అస్సలు ఉండదు…వండలేం కూడా. మనం ప్రతిరోజూ వండుకునే కూరల్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉల్లిపాయ లేని కూరను ఊహించుకోలేము. కానీ చాలా మంది ఉల్లిపాయలను అలాగే తినేస్తుంటారు. పచ్చిగా తిన్నా….వండుకోని తిన్నా…ఎలా తిన్నా ఉల్లిపాయ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ హాని చేయదు. మరి పచ్చి ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు నిత్యం పచ్చి ఉల్లిపాయను లాగించండి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుందని డాక్టర్లు […]

పచ్చి ఉల్లిపాయ ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు...!
X

ఉల్లిపాయలేని కూర ఉంటుందా? అస్సలు ఉండదు…వండలేం కూడా. మనం ప్రతిరోజూ వండుకునే కూరల్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉల్లిపాయ లేని కూరను ఊహించుకోలేము.

కానీ చాలా మంది ఉల్లిపాయలను అలాగే తినేస్తుంటారు. పచ్చిగా తిన్నా….వండుకోని తిన్నా…ఎలా తిన్నా ఉల్లిపాయ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ హాని చేయదు. మరి పచ్చి ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

  1. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు నిత్యం పచ్చి ఉల్లిపాయను లాగించండి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కొవ్వు తగ్గాలంటే…పచ్చి ఉల్లిపాయ తినాల్సిందేనని సైంటిస్టులు కూడా అంటున్నారు.
  2. క్రోమియం అనే పదార్థం ఉల్లిలో ఎక్కువగా ఉంటుందట. ఇది రక్తంలోని షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ గా ఉంచుతుందట. పచ్చిఉల్లి తిన్నట్లయితే….షుగర్ లెవల్స్ అదుపులో ఉండటంతోపాటు టైప్ 2 డయాబెటిస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో డయాబెటిస్ ను తగ్గించుకోవాలంటే నిత్యం పచ్చి ఉల్లిపాయను తినాల్సిందే.
  3. ఇవే కాకుండా ఉల్లిపాయలో ఇంకెన్నో మంచి గుణాలు ఉన్నాయి. యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ సెస్టిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ బయోటిక్ వంటివి ఉన్నాయి. ఇవి శ్వాసకోశ సమస్య, ఇన్ ఫెక్షన్ల భారీన పడకుండా రక్షిస్తాయి.
  4. ఉల్లిపాయలో ఎన్నో రకాల విటమిన్లు ఉన్నాయి. సి, బి1, బి6, విటమిన్k, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన పోషణ అందిస్తాయి.
  5. డయేరియా, దగ్గు, ఫ్లూ జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే… పచ్చిఉల్లిని నిత్యం తీసుకోవాలి.
First Published:  25 Feb 2019 2:20 AM IST
Next Story