పవన్ ముందే జగన్‌ను గెలిపించాలని రైతు నినాదాలు
కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఒక రైతు నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఆదోని మార్కెట్ యార్డులో పత్తి రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక రైతును వేదిక మీదకు పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేశారు పవన్. ఈ సందర్భంగా రైతు తన ఆవేదన వెల్లగక్కారు. ప్రభుత్వం తమకు ఏమాత్రం ఆదుకోలేదన్నారు. చివరకు తన పశువులను కూడా అమ్ముకున్నానని చెప్పారు. కాబట్టి ఈసారి అందరూ కలిసి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని […]
కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఒక రైతు నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఆదోని మార్కెట్ యార్డులో పత్తి రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక రైతును వేదిక మీదకు పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేశారు పవన్.
ఈ సందర్భంగా రైతు తన ఆవేదన వెల్లగక్కారు. ప్రభుత్వం తమకు ఏమాత్రం ఆదుకోలేదన్నారు. చివరకు తన పశువులను కూడా అమ్ముకున్నానని చెప్పారు. కాబట్టి ఈసారి అందరూ కలిసి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని పవన్ కల్యాణ్ సమక్షంలోనే రైతు కోరారు. అప్పుడే అందరికీ మంచి జరుగుతుందన్నారు.
జగన్ వస్తే ప్రతి రైతు ఆనందంగా ఉంటారని వ్యాఖ్యానించారు. తొలుత రైతు పొరపాటును జగన్‌ను గెలిపించాలి అని పిలుపునిచ్చారేమో అనుకున్నారు. కానీ రైతు మరోసారి కూడా అందరూ కలిసి జగన్‌ను గెలిపించాలని కోరారు.
రైతు వ్యాఖ్యలతో పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ కంగుతిన్నారు. చివరకు రైతు తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండడంతో పవన్ కల్యాణ్ ఒక్క నిమిషం అంటూ మైక్ తీసుకుని రైతును పంపించేశారు.