Telugu Global
National

10 రూపాయలు కట్టి ఈవీఎం అడగొచ్చు..!

దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఓటమి పాలైన అభ్యర్థులు ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయామంటూ అనడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో సార్లు ఈవీఎంల భద్రతపై రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. వాటిని ట్యాంపరింగ్ చేయడం కష్టసాధ్యమని కూడా చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని సార్లు అనుమానాలు నివృత్తి చేసినా…. వీటిపై ఆరోపణలు మాత్రం తగ్గలేదు. […]

10 రూపాయలు కట్టి ఈవీఎం అడగొచ్చు..!
X

దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఓటమి పాలైన అభ్యర్థులు ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయామంటూ అనడం పరిపాటిగా మారింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో సార్లు ఈవీఎంల భద్రతపై రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. వాటిని ట్యాంపరింగ్ చేయడం కష్టసాధ్యమని కూడా చెప్పింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని సార్లు అనుమానాలు నివృత్తి చేసినా…. వీటిపై ఆరోపణలు మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను కూడా సామాచార హక్కు చట్టం కింద అడగవచ్చని.. వాటిని తీసుకొని పరిశీలించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇటీవల ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఒక రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈవీఎం కావాలని కోరాడు. అయితే అతడి అభ్యర్థనను ఈసీ తిరస్కరించింది.

ఈసీ నిర్ణయంపై సదరు వ్యక్తి సీఈసీని సంప్రదించాడు. దీంతో ఇలాంటి దరఖాస్తులకు ఈసీ తప్పక స్పందించాలని.. అవసరమైతే ఈవీఎంను అందించాలని.. 10 రూపాయల చలానా చెల్లించి ఇలా కోరే అధికారం ప్రజలకు ఉందని సీఈసీ స్పష్టం చేసింది.

అయితే ఈవీఎంను ఇవ్వాలా? లేదా? చట్టంలోని మినహాయింపుల ప్రకారం అభ్యర్థనను తిరస్కరించాలా? అనే విచక్షణ ఈసీకి ఉంటుందని పేర్కొంది. ఇటీవల ఈసీకి వచ్చిన దరఖాస్తును తిరస్కరించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఈసీ వెల్లడించింది.

First Published:  25 Feb 2019 4:40 AM IST
Next Story