Telugu Global
NEWS

ఏటీపీ టూర్ 100 వ టైటిల్ కు ఫెదరర్ గురి

37 ఏళ్లకే 99 టూర్ టైటిల్స్ సాధించిన స్విస్ గ్రేట్ 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మెునగాడు ఫెదరర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టైటిల్ వేటలో వెటరన్ ఫెదరర్ గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ తన కెరియర్ లో 100వ ATP టూర్ టైటిల్ కు గురిపెట్టాడు.  37 ఏళ్ల వయసుకే 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ తో సహా మొత్తం 99 టూర్ టైటిల్స్ సాధించిన ఫెదరర్…రెండోసీడ్ గా దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ టోర్నీ టైటిల్ […]

ఏటీపీ టూర్ 100 వ టైటిల్ కు ఫెదరర్ గురి
X
  • 37 ఏళ్లకే 99 టూర్ టైటిల్స్ సాధించిన స్విస్ గ్రేట్
  • 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మెునగాడు ఫెదరర్
  • దుబాయ్ డ్యూటీ ఫ్రీ టైటిల్ వేటలో వెటరన్ ఫెదరర్

గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ తన కెరియర్ లో 100వ ATP టూర్ టైటిల్ కు గురిపెట్టాడు. 37 ఏళ్ల వయసుకే 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ తో సహా మొత్తం 99 టూర్ టైటిల్స్ సాధించిన ఫెదరర్…రెండోసీడ్ గా దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ టోర్నీ టైటిల్ వేటకు దిగుతున్నాడు.

ప్రస్తుత సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టోర్నీ … ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన వెటరన్ ఫెదరర్… త్వరలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ లో సైతం పాల్గొనబోతున్నట్లు ప్రకటించాడు.

గత అక్టోబర్ లో సాధించిన బాసెల్ ఓపెన్ వరకూ 99 టోర్నీలు నెగ్గిన ఫెదరర్…ప్రస్తుత దుబాయ్ మాస్టర్స్ టోర్నీలో సైతం విజేతగా నిలిస్తే…ATP టూర్ టైటిల్స్ సెంచరీ సాధించిన అరుదైన ఆటగాడి ఘనతను సైతం సొంతం చేసుకోగలుగుతాడు.

దుబాయ్ మాస్టర్స్ టోర్నీలో ఇప్పటి వరకూ ఐదుసార్లు విజేతగా నిలిచిన ఫెదరర్ …ఆరోటైటిల్ నెగ్గితే డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసినట్లవుతుంది.

8 వింబుల్డన్, 6 ఆస్ట్రేలియన్, 5 అమెరికన్ టైటిల్స్….

అంతేకాదు… రోజర్ ఫెదరర్…రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. లేటు వయసులోనూ ప్రపంచ మేటి టెన్నిస్ ఆటగాడిగా తన కెరియర్ ను కొనసాగిస్తున్న ఫెదరర్ ఇప్పటి వరకూ సాధించిన 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో అత్యధికంగా ఎనిమిది వింబుల్డన్ టైటిల్స్ ఉన్నాయి.

అయితే…వింబుల్డన్ టైటిల్ ను తొమ్మిదోసారి గెలుచుకోడానికి ప్రాక్టీస్ ప్రారంభించినట్లు…కూల్ కూల్ స్విస్ స్టార్ ఫెదరర్ ప్రకటించాడు. తన కెరియర్ లో ఇప్పటికే ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఐదు అమెరికన్ ఓపెన్ టైటిల్స్ సాధించిన ఫెదరర్ కు …ఓ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సైతం సాధించిన అరుదైన రికార్డు ఉంది.

310 వారాల నంబర్ వన్….

310 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలిచిన ఫెదరర్…ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.

2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ఇంటిదారి పట్టిన ఫెదరర్…త్వరలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలలో సైతం తన అదృష్టం పరీక్షించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

First Published:  25 Feb 2019 12:21 PM IST
Next Story