ఏపీలో ఫోన్ ట్యాపింగ్
ఓటుకు నోటు తర్వాత మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యర్థులపై ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. కేవలం భద్రతా పరమైన అంశాలకు మాత్రమే వాడాల్సిన కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతోందని ఆరోపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులతో పాటు రాష్ట్రంలోని ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాప్ చేయడానికి ప్రత్యేకంగా చంద్రబాబు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారని కథనం. ఇప్పటికే ఇంటెలిజెన్స్ […]
ఓటుకు నోటు తర్వాత మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యర్థులపై ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. కేవలం భద్రతా పరమైన అంశాలకు మాత్రమే వాడాల్సిన కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతోందని ఆరోపిస్తోంది.
రాజకీయ ప్రత్యర్థులతో పాటు రాష్ట్రంలోని ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాప్ చేయడానికి ప్రత్యేకంగా చంద్రబాబు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారని కథనం. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో మొత్తం తన మనుషులనే ఉంచుకున్న చంద్రబాబు.. ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం మరో అస్మదీయుడైన ఉన్నతాధికారితో పాటు ఫోన్ ట్యాపింగ్‌పై అవగాహన ఉన్న మరో నలుగురు అధికారులను కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను వాడేందుకు ఉపయోగిస్తున్నారు.
ఫోన్ల ట్యాపింగ్ ద్వారానే ఉన్నతాధికారులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని… వారు టీడీపీకి అనుకూలంగా లేరని నిర్ధారణ అయ్యాక ఇతర అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఫోన్ల ట్యాపింగ్ ఆధారంగానే ఒక కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఒక ఐపీఎస్ అధికారిని లా అండ్ ఆర్డర్ నుంచి అప్రాధాన పోస్టుకు బదిలీ చేశారు.
రాష్ట్రంలో ఏం జరుగుతోందో తనకు పూర్తిగా తెలియాలని చంద్రబాబు ఆదేశించడంతోనే ఇంటెలిజెన్స్, ఆస్మదీయ అధికారులు రంగంలోకి దిగి కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను వాడుతూ టీడీపీ ప్రత్యర్థులు, ఉన్నతాధికారుల సంభాషణను వింటున్నట్టు తెలుస్తోంది.