Telugu Global
NEWS

జగన్ కు సహకరిద్దాం: బిసీ, దళిత అధికారులు!

ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని ఏపీ బీసీ, దళిత ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. ఆదివారం నాడు పలు జిల్లాల్లో బీసీ, దళిత ఉన్నతాధికారుల రహస్య సమావేశం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి జిల్లాలోనూ జరిగిన ఈ సమావేశాలు తెలుగుదేశం పార్టీ పాలన విధానాలపై మండిపడినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పోస్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సంబంధించిన సామాజిక వర్గం వారు ఎక్కువగా […]

జగన్ కు సహకరిద్దాం: బిసీ, దళిత అధికారులు!
X

ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని ఏపీ బీసీ, దళిత ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. ఆదివారం నాడు పలు జిల్లాల్లో బీసీ, దళిత ఉన్నతాధికారుల రహస్య సమావేశం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రతి జిల్లాలోనూ జరిగిన ఈ సమావేశాలు తెలుగుదేశం పార్టీ పాలన విధానాలపై మండిపడినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పోస్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సంబంధించిన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారని, బీసీలు, దళిత అధికారుల్లో సీనియర్లు ఉన్నా వారిని పట్టించుకోలేదని సమావేశంలో అభిప్రాయ పడినట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఏ ఏపోస్టుల్లో ఎవరెవరున్నారో ఓ పత్రికలో సవివరంగా వచ్చింది. ఈ కథనంపై ఆంధ్రప్రదేశ్ లోని బి.సి, దళిత అధికారులు ఒకింత ఆశ్చర్యానికి ఆందోళనకు గురైనట్లు చెబుతున్నారు.

“మాకు అన్యాయం జరుగుతోందని తెలుసు. అయితే మరీ ఇంత దారుణంగా ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు” అని దళిత ఉన్నతాధికారి ఒకరు తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు చెబుతున్నారు.
రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకంగా పని చేయకపోతే భవిష్యత్తులో బీసీ దళిత అధికారుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బీసీలు, దళితులకు న్యాయం చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఆ వర్గాలకు చెందిన సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఒక వేళ తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తమను మరింత అధః పాతాళానికి తొక్కేస్తాడు అని బీసీ, దళిత అధికారులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు లో ఉన్న కర్కశత్వం జగన్మోహన్ రెడ్డి లో కనిపించడం లేదని, అది ఆయన చేసిన పాదయాత్రలో స్పష్టమైందని సమావేశంలో పాల్గొన్న అధికారులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

బీసీ, దళిత, మైనారిటీలకు న్యాయం జరగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరాలని, అప్పుడే ఉద్యోగుల పరిస్థితుల్లో మార్పులు వస్తాయని బీసీ, దళిత ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న పలువురు స్పష్టం చేసినట్లు సమాచారం.

First Published:  25 Feb 2019 10:30 AM IST
Next Story