మహానాయకుడుకి మహా అవమానం
ఎన్టీఆర్ బయోపిక్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తెలుగు సినీచరిత్రలోనే ఇప్పటివరకు ఎవ్వరూ సృష్టించని అతిపెద్ద డిజాస్టర్ గా ఎన్టీఆర్-మహానాయకుడు నిలవబోతోంది. మొదటి రోజే ఈ సినిమాకు సిగ్గుపడే రీతిలో వసూళ్లు రాగా.. ఆ కలెక్షన్ల పరంపర రెండో రోజు కూడా కొనసాగింది. రెండో రోజు మహానాయకుడు సినిమాకు కేవలం 40 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెంటర్లలో కనీసం థియేటర్ రెంట్ కట్టడానికి సరిపడా చిల్లర కూడా ఈ సినిమా […]
ఎన్టీఆర్ బయోపిక్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తెలుగు సినీచరిత్రలోనే ఇప్పటివరకు ఎవ్వరూ సృష్టించని అతిపెద్ద డిజాస్టర్ గా ఎన్టీఆర్-మహానాయకుడు నిలవబోతోంది. మొదటి రోజే ఈ సినిమాకు సిగ్గుపడే రీతిలో వసూళ్లు రాగా.. ఆ కలెక్షన్ల పరంపర రెండో రోజు కూడా కొనసాగింది.
రెండో రోజు మహానాయకుడు సినిమాకు కేవలం 40 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెంటర్లలో కనీసం థియేటర్ రెంట్ కట్టడానికి సరిపడా చిల్లర కూడా ఈ సినిమా నుంచి రాలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఓవరాల్ గా ఈ రెండు రోజుల్లో మహానాయకుడు సినిమాకు కేవలం కోటిన్నర షేర్ మాత్రమే వచ్చింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అమెరికాలో ఈ సినిమాకు వస్తున్న వసూళ్లతో ఓ 10 మందికి సరిపడ రెస్టారెంట్ బిల్లు కూడా చెల్లించలేని పరిస్థితి. ఓ ‘వర్గం’ ఈ సినిమాను ఓవర్సీస్ లో బాగా ప్రోత్సహిస్తుందని మేకర్స్ భ్రమపడ్డారు. కానీ ఆ ‘వర్గం’ కూడా మహానాయకుడ్ని లైట్ తీసుకుంది.
ఇక టాలీవుడ్ చరిత్రను ఓసారి గమనిస్తే.. కృష్ణ నటించిన సినిమాలు కొన్ని గతంలో డిజాస్టర్లుగా నిలిచాయి. తర్వాత ఆ స్థానాన్ని బాలయ్య నటించిన పరమవీర చక్ర సినిమా అక్రమించింది. మొన్నటివరకు అత్యల్ప వసూళ్లు సాధించిన సినిమా ఇదే. కాకపోతే నాగార్జున నటించిన ఆఫీసర్ సినిమా వచ్చి పరమవీరచక్ర కంటే కనిష్టంగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడా ఆఫీసర్ సినిమాను కూడా మహానాయకుడు సినిమా అధిగమిస్తోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని అత్యల్ప వసూళ్లను సాధిస్తోంది. భవిష్యత్తులో మహానాయకుడు రికార్డును మరో స్టార్ హీరో సినిమా క్రాస్ చేయలేకపోవచ్చు. ఇది మహానాయకుడు కాదు, ఎన్టీఆర్ కు జరిగిన మహా అవమానం.