Telugu Global
Health & Life Style

కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే... ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

ఈ మధ్యకాలంలో చాలామంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రాళ్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కిడ్నీల్లో రాళ్లు ఉంటే మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో మంట, నొప్పి, వికారం, జ్వరం, పొట్ట కిందిభాగంలో తీవ్రమైన నొప్పి, సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, దుర్వాసన రావడం, తక్కువగా రావడం…. ఇలాంటి ఎన్నోరకాల లక్షాలు కనిపిస్తాయి. అయితే కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు వైద్యుని సలహాతోపాటు ఈ ఆహారాలను ప్రతిరోజూ తీసుకున్నట్లయితే…. వాటిని తొందరగా […]

ఈ మధ్యకాలంలో చాలామంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రాళ్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కిడ్నీల్లో రాళ్లు ఉంటే మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో మంట, నొప్పి, వికారం, జ్వరం, పొట్ట కిందిభాగంలో తీవ్రమైన నొప్పి, సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, దుర్వాసన రావడం, తక్కువగా రావడం…. ఇలాంటి ఎన్నోరకాల లక్షాలు కనిపిస్తాయి.

అయితే కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు వైద్యుని సలహాతోపాటు ఈ ఆహారాలను ప్రతిరోజూ తీసుకున్నట్లయితే…. వాటిని తొందరగా కరిగించేలా చేయవచ్చు. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుకుందాం.

1. యాపిల్స్ జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాదు…కిడ్నీల్లో రాళ్లు రాకుండా చూడటంలో మెరుగ్గా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తీసుకున్నట్లయితే కిడ్నీల్లో రాళ్లు రావు. ఉన్న రాళ్లు కూడా కరిగిపోతాయి.

2. తులసి ఆకులో చాలా గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకుల రసంలో కొంచెం తేనె కలుపుకుని తీసుకోవాలి. ఇలా ఆరు నెలల పాటు తాగినట్లయితే ఎలాంటి రాళ్లు అయినా సరే కరిగిపోవడం ఖాయం.

3. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు ద్రాక్షలను నిత్యం తింటుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

4. వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తాయి. పుచ్చకాయలను నిత్యం తీసుకున్నట్లయితే స్టోన్లు కరిగిపోతాయి.

5. నిత్యం ఉదయం, సాయంత్రం భోజనం చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ లో ఒక టీ స్పూన్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి సేవించాలి. రాళ్లు తొందరగా కరిగిపోతాయి.

6. వీటన్నింటితో పాటుగా బి6 ప్రొటీన్ ఎక్కువగా ఉన్న సోయాబిన్, కోడిగుడ్లు, బ్రౌన్ రైస్ …వంటి ఆహారాలను నిత్యం తీసుకున్నట్లయితే… కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

First Published:  24 Feb 2019 2:06 AM IST
Next Story