మహిళలకు మంత్రి పదవి ఇచ్చేదాకా కేసీఆర్ ని నమ్మలేం!
“ ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో రెండు స్థానాలను మహిళలకు కేటాయిస్తాం. మేము ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నామంటే మహిళా ఓటర్లే కారణం. వారిని మేము ఎప్పుడూ విస్మరించం” తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ప్రసంగం ఇది. “ ఆయన మా పార్టీ అధ్యక్షుడైనా మహిళా శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వరకు మేం నమ్మలేం” ఇది తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం. […]
“ ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో రెండు స్థానాలను మహిళలకు కేటాయిస్తాం. మేము ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నామంటే మహిళా ఓటర్లే కారణం. వారిని మేము ఎప్పుడూ విస్మరించం” తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ప్రసంగం ఇది.
“ ఆయన మా పార్టీ అధ్యక్షుడైనా మహిళా శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వరకు మేం నమ్మలేం” ఇది తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం.
మహిళల పట్ల తెలంగాణ రాష్ట్ర సమితికి…. ముఖ్యంగా ముఖ్యమంత్రికి గౌరవం లేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి శాసన సభలో ప్రకటించిన అనంతరం మాత్రమే మరో ఇద్దరు మహిళ శాసన సభ్యులకు మంత్రి పదవులు ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు.
అలా కాకుండా ఈ మధ్య జరిగిన క్యాబినెట్ విస్తరణలోనే కనీసం ఒక్క మహిళా శాసనసభ్యురాలికైనా మంత్రి పదవి ఇచ్చి ఉంటే కేసీఆర్ ను పార్టీ వారే కాకుండా ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉండేదని అంటున్నారు.
త్వరలో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి ఎలా లేదన్నా కనీసం 6 నెలలు పడుతుంది. ఆ తర్వాత వేరే ఏదో కారణాలతో మంత్రి మండలి విస్తరణ ఉంటుందో, ఉండదో అనుమానంగానే ఉంది అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ మహిళలకు మంత్రులకు అవకాశం ఉంది అని కేసిఆర్ చేసిన ప్రకటనను విశ్వసించడం లేదని తెలంగాణ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇద్దరు మహిళా మంత్రుల స్థానాల కోసం ఐదుగురు మహిళలు పోటీ పడుతున్నారు. వీరిలో ముగ్గురు శాసనసభకు ఎన్నికైన వారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన శాసన సభ్యురాలు. మరొకరు ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్న మహిళా నాయకురాలు.
వీరిలో ఎమ్మెల్సీ గా ఎన్నిక కానున్న సత్యవతి రాథోడ్ కి గాని, ఎమ్మెల్యే రేఖ నాయక్ కి గాని మంత్రి పదవి కట్టబెడితే అటు మహిళలకు, ఇటు గిరిజనుల కోట కూడా నింపినట్లుగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీనియర్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయంటున్నారు. దీనికి కారణం ఆమె మాజీ మంత్రి హరీష్ రావు వర్గానికి చెందినవారు కావడమే. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పటికే ఎక్కువమంది మంత్రి వర్గంలో ఉండడంతో ఆ కోటా కింద కూడా పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవని అంటున్నారు.