Telugu Global
NEWS

సోమవారం తరువాత జనసేన.... నో ఎంట్రీ బోర్డ్‌ ?

ఒకవైపు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ఖరారు గురించి కసరత్తులు కొనసాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీటింగుల మీద మీటింగులు నిర్వహిస్తూ ఉన్నారు. పార్లమెంట్ సీట్ల వారీగా చంద్రబాబు నాయుడు ఈ మీటింగులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా వివిధ సీట్లకు బాబు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఖరారు చేయడం మాత్రమే..అధికారిక ప్రకటనలు వేరే అని అంటున్నారు. ప్రస్తుతానికి అభయం ఇచ్చిన వాళ్లందరికీ టికెట్లు దక్కుతున్నట్టు కాదని.. నామినేషన్లు దాఖలు చేసే […]

సోమవారం తరువాత జనసేన.... నో ఎంట్రీ బోర్డ్‌ ?
X

ఒకవైపు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ఖరారు గురించి కసరత్తులు కొనసాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీటింగుల మీద మీటింగులు నిర్వహిస్తూ ఉన్నారు. పార్లమెంట్ సీట్ల వారీగా
చంద్రబాబు నాయుడు ఈ మీటింగులు నిర్వహిస్తూ ఉన్నారు.

ఇందులో భాగంగా వివిధ సీట్లకు బాబు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఖరారు చేయడం మాత్రమే..అధికారిక ప్రకటనలు వేరే అని అంటున్నారు. ప్రస్తుతానికి అభయం ఇచ్చిన వాళ్లందరికీ టికెట్లు దక్కుతున్నట్టు కాదని.. నామినేషన్లు దాఖలు చేసే లోపు బాబు మళ్లీ అభ్యర్థులను మార్చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతూ ఉంది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. కూతురును చూసి రావడానికి వెళ్లారు ఆయన.మంగళవారం తిరిగి రానున్నారు. బుధవారం నుంచి జగన్ మళ్లీ పార్టీ కార్యకలాపాల మీద దృష్టి సారించవచ్చు. ఇదీ ఆ పార్టీల్లో పరిస్థితి.

ఇక జనసేన విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఎంపికకు ఇప్పటికే అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియ మొదలై కొన్ని రోజులు గడిచాయి. ఈ నేపథ్యంలో రేపు సోమవారంతో జనసేన అభ్యర్థుల అప్లికేషన్లకు దరఖాస్తు గడువు ముగియనుంది!

ఈ మేరకు ఆ పార్టీ ఇది వరకే ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న వాళ్లకే టికెట్లు అని కూడా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రేపటిలోగా దరఖాస్తు చేసుకుంటే ఓకే, లేకపోతే జనసేనలోకి ఆ తర్వాత చేరి కూడా ప్రయోజనం ఏమీ ఉండదని ప్రచారం జరుగుతూ ఉంది. మరి అసలు కథ ఎలా ఉండబోతోందో!

First Published:  24 Feb 2019 6:39 AM IST
Next Story