పాక్ తో క్రికెట్ మ్యాచ్ లపై కొహ్లీ ఏమన్నాడంటే..?
తొలి టీ-20కి స్టీల్ సిటీ రెడీ విశాఖ వేదికగా ఆసీస్ తో సూపర్ సండే తొలి టీ-20 ఫైట్ రాత్రి 7 గంటల నుంచి తొలి టీ-20 సమరం ధూమ్ ధామ్ టీ-20 రెండో ర్యాంకర్ టీమిండియా, ఐదో ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్ల…రెండుమ్యాచ్ ల సిరీస్ కు…స్టీల్ సిటీ విశాఖలోని ఆంధ్రక్రికెట్ సంఘం స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈమ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు […]
- తొలి టీ-20కి స్టీల్ సిటీ రెడీ
- విశాఖ వేదికగా ఆసీస్ తో సూపర్ సండే తొలి టీ-20 ఫైట్
- రాత్రి 7 గంటల నుంచి తొలి టీ-20 సమరం
ధూమ్ ధామ్ టీ-20 రెండో ర్యాంకర్ టీమిండియా, ఐదో ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్ల…రెండుమ్యాచ్ ల సిరీస్ కు…స్టీల్ సిటీ విశాఖలోని ఆంధ్రక్రికెట్ సంఘం స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈమ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు ఇప్పటికే విశాఖ స్టేడియంలో జరిగిన నెట్ ప్రాక్టీస్ లో సాధన పూర్తి చేశారు.
ఇటీవలే కంగారూగడ్డపైన జరిగిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 1-1తో డ్రాగా ముగించిన టీమిండియా…ప్రస్తుత సిరీస్ లో సైతం హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. పంజాబ్ యువలెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే టీ-20 అరంగేట్రానికి ఎదురు చూస్తున్నాడు.
ప్రభుత్వం, బీసీసీఐ ఏది చెప్తే అదే…
ఆస్ట్రేలియాతో డబుల్ ధమాకా టీ-20 సిరీస్ తో పాటు… పాంచ్ పటాకా వన్డే సిరీస్ కూ తాము సిద్ధమని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రకటించాడు.
సూపర్ సండే ఫైట్ గా జరిగే తొలి టీ-20 వేదిక విశాఖలోని ఆంధ్ర క్రికెట్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో కొహ్లీ పాల్గొన్నాడు.
పుల్వామా ఘటన మహా విషాదమని… ఉగ్రవాద చర్యలో అశువులు బాసిన వీరజవాన్ల ఆత్మకు శాంతి కలగాలని టీమిండియా జట్టు సభ్యులు కోరుకొంటున్నట్లు తెలిపాడు.
పాకిస్థాన్ తో క్రికెట్ ఆడే విషయమై… భారత ప్రభుత్వం, బీసీసీఐ తీసుకొన్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని… దేశమంతా ఏది కావాలనుకొంటే…. అదే చేస్తామని చెప్పాడు.