Telugu Global
NEWS

ఏవండీ... ఆయన వచ్చారు! వెళ్లారు!

ఇదేమిటి… ఆయన ఎవరు? ఎక్కడకు వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? ఎవరు ఎవరితో ఈ విషయం చెబుతున్నారు అనుకుంటున్నారా!? ఏం లేదు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. వెళ్లారు. ఆయన ఎందుకు వచ్చారు. ఏం మాట్లాడారు. ఎక్కడికి వెళ్లారు… ఇదే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత చర్చనీయాంశం. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంట్లోనూ శుక్రవారం రాత్రి ఇదే మాట వినపడిందట. ఆయన వచ్చారు. వెళ్ళారు. గడచిన కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ కు […]

ఏవండీ... ఆయన వచ్చారు! వెళ్లారు!
X

ఇదేమిటి… ఆయన ఎవరు? ఎక్కడకు వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? ఎవరు ఎవరితో ఈ విషయం చెబుతున్నారు అనుకుంటున్నారా!? ఏం లేదు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. వెళ్లారు. ఆయన ఎందుకు వచ్చారు. ఏం మాట్లాడారు. ఎక్కడికి వెళ్లారు… ఇదే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత చర్చనీయాంశం.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంట్లోనూ శుక్రవారం రాత్రి ఇదే మాట వినపడిందట. ఆయన వచ్చారు. వెళ్ళారు. గడచిన కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకువస్తామని, తాము అధికారంలోకి రాగానే రాష్ట్రం రూపు రేఖలే మార్చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఊదరగొడుతోంది.

తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పై భూమి దద్దరిల్లేలా ఓ పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు పెద్ద హంగామా చేశారు. ఈ సభకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి అద్భుతమైన ప్రసంగం తో ప్రజల మనసు మార్చేస్తారని కాంగ్రెస్ పెద్దలు కలలు కన్నారు. అదేదో సామెత చెప్పినట్లు రాహుల్ గాంధీ వచ్చారు. ఆయనకు నచ్చింది మాట్లాడారు. తిరిగి వెళ్లిపోయారు. ఇది తిరుపతి సభ తీరు.

రానున్న శాసనసభ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు కనీసం పది స్థానాలైనా వస్తాయని ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అధ్యక్షుడు వచ్చి ప్రత్యేక హోదా చిలుక పలుకులు పలికి ప్రజల మనసు మారుస్తారని కలలుగన్నారు.

అయితే రాహుల్ గాంధీ మాత్రం తన సాదాసీదా ప్రసంగంతో సభికులను ఆకట్టుకోలేకపోయారు. రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నంత సేపూ ఈ సభకు ఎందుకు వచ్చాము దేవుడా…. ఎంకటేశా అని తిరుమల కొండ వైపు తిరిగి దండం పెడుతూ తలలు బాదుకున్నారు.

ప్రత్యేక హోదా ఇచ్చేది తామేనని, తమకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తామంటూ గత రెండు సంవత్సరాలుగా చేసిన ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేసి ఎంచక్కా వెళ్లిపోయారు రాహుల్ గాంధీ. ఆయన ప్రసంగంలో కొత్తదనం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా డీలా పడిపోయారంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్పిస్తామన్న భరోసా కనీసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులకు కూడా కల్పించలేదని ఆ పార్టీ వారే చెవులు కొరుక్కుంటున్నారు.

First Published:  22 Feb 2019 11:33 PM IST
Next Story