Telugu Global
NEWS

భరోసా యాత్ర ఇలాగేనా.... రాహుల్ మండిపాటు

ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భరోసా బహిరంగ సభ పై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహించారు. “ఇలాగేనా సభ నిర్వహించడం” అని పార్టీ నాయకులపై మండిపడినట్లు సమాచారం. ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన సభ చూసిన తర్వాత తనకే ఎలాంటి భరోసా కలగలేదని కాంగ్రెస్ నాయకులతో అన్నట్లు సమాచారం. ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్న సమయంలో వారిని తమ దగ్గరకు తెచ్చుకునేందుకు ఎంత  […]

భరోసా యాత్ర ఇలాగేనా.... రాహుల్ మండిపాటు
X

ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భరోసా బహిరంగ సభ పై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహించారు. “ఇలాగేనా సభ నిర్వహించడం” అని పార్టీ నాయకులపై మండిపడినట్లు సమాచారం.

ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన సభ చూసిన తర్వాత తనకే ఎలాంటి భరోసా కలగలేదని కాంగ్రెస్ నాయకులతో అన్నట్లు సమాచారం. ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్న సమయంలో వారిని తమ దగ్గరకు తెచ్చుకునేందుకు ఎంత వ్యూహాత్మకంగా ఉండాలో తెలియక పోవడం కాంగ్రెస్ నాయకుల అసమర్థతేనని రాహుల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంతో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీల పట్ల ప్రజల్లో ఎంతో ఆగ్రహం ఉందని, అలాంటి సమయంలో ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలో ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం రాష్ట్ర నాయకులకు ఉందని రాహుల్ గాంధీ అన్నట్లు సమాచారం.

“ రెండు బస్సులు, పది కార్లు, 50 మోటార్ సైకిళ్లు, 5 వేల మంది కార్యకర్తలతో ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటున్నారా?” అని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులతో అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తిరుపతిలో నిర్వహించిన భరోసా యాత్ర సభ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు అని, మూడు నెలలు ముందుగానే నిర్ణయించినా ఇలా చేయడం పట్ల రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల నుంచి పార్టీ దూరం అయినా గాని నాయకుల్లో మాత్రం విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని, దీనికి నిదర్శనం తిరుపతిలో నిర్వహించిన భరోసా బహిరంగ సభేనని రాహుల్ గాంధీ అన్నట్లు చెబుతున్నారు.

భవిష్యత్తు లో నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలైనా పగడ్బందీగా జరిగేలా చూడాలని, నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకో లేదని రాహుల్ గాంధీ కాస్త గట్టిగానే మందలించినట్లు చెబుతున్నారు.

First Published:  23 Feb 2019 7:34 AM IST
Next Story