Telugu Global
NEWS

యుద్ధ విమానంలో కో -పైలెట్ గా పీవీ సింధు

బెంగళూరు ఏయిర్ షోలో సింధు షో తేజాస్ కోపైలట్ గా వ్యవహరించిన భారత తొలిమహిళ సింధు భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ఓ అరుదైన ఘనత సంపాదించింది.  భారత దేశవాళీ తయారీ లైట్ ఫైటర్ జెట్ విమానం తేజాస్ కు కో-పైలట్ గా వ్యవహరించిన భారత తొలిమహిళగా చరిత్ర సృష్టించింది. బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షోలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింధు ప్రత్యేక అతిథిగా పాల్గొంది. యలహంక విమాన స్థావరంలోని ఓ లైట్ ఫైటర్ జెట్ […]

యుద్ధ విమానంలో కో -పైలెట్ గా పీవీ సింధు
X
  • బెంగళూరు ఏయిర్ షోలో సింధు షో
  • తేజాస్ కోపైలట్ గా వ్యవహరించిన భారత తొలిమహిళ సింధు

భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ఓ అరుదైన ఘనత సంపాదించింది. భారత దేశవాళీ తయారీ లైట్ ఫైటర్ జెట్ విమానం తేజాస్ కు కో-పైలట్ గా వ్యవహరించిన భారత తొలిమహిళగా చరిత్ర సృష్టించింది.

బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షోలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింధు ప్రత్యేక అతిథిగా పాల్గొంది.

యలహంక విమాన స్థావరంలోని ఓ లైట్ ఫైటర్ జెట్ విమానంలో సింధు…కో-పైలట్ గా ఆకాశంలో చక్కర్లు కొట్టిన అనుభవాన్ని చవిచూసింది.

గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ..ఓ యుద్ధవిమానంలో దూసుకుపోయిన భారత తొలి యువతిగా గుర్తింపు తెచ్చుకొంది.

First Published:  23 Feb 2019 8:04 AM IST
Next Story