Telugu Global
Health & Life Style

పప్పుదినుసులను తేలికగా తీసేయకండి!

పప్పుచారు, టమాటపప్పు, గోంగూర పప్పు, ముద్దపప్పు…. ఇలా పప్పు దినుసులు నిత్యం భారతీయుల వంటల్లో భాగమయ్యాయి. ప్రతిరోజూ చేసుకునే వంటల్లో పప్పుదినుసులు తప్పకుండా చేర్చుతారు. కూరగాయలు లేకున్నా సరే…. పప్పుదినుసులు ఉంటే చాలు. వాటితోనే కర్రీ చేసుకుని తింటారు. ఈ క్రమంలోనే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వంటి పలు పప్పుదినుసులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పప్పులే కదా పప్పులో కాలేస్తూ….వాటిని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే మనం నిత్యం పప్పుదినుసులను తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయట. […]

పప్పుదినుసులను తేలికగా తీసేయకండి!
X

పప్పుచారు, టమాటపప్పు, గోంగూర పప్పు, ముద్దపప్పు…. ఇలా పప్పు దినుసులు నిత్యం భారతీయుల వంటల్లో భాగమయ్యాయి. ప్రతిరోజూ చేసుకునే వంటల్లో పప్పుదినుసులు తప్పకుండా చేర్చుతారు.

కూరగాయలు లేకున్నా సరే…. పప్పుదినుసులు ఉంటే చాలు. వాటితోనే కర్రీ చేసుకుని తింటారు. ఈ క్రమంలోనే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వంటి పలు పప్పుదినుసులు మనకు అందుబాటులో ఉన్నాయి.

కానీ పప్పులే కదా పప్పులో కాలేస్తూ….వాటిని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే మనం నిత్యం పప్పుదినుసులను తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయట. కాబట్టి ఎలాంటి లాభాలు ఉన్నాయి…ఆరోగ్యకర ప్రయోజనాలు ఎలా కలుగుతాయో తెలుసుకుందాం.

  1. ప్రతిరోజూ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకుంటే…. కొలెస్ట్రాల్ స్ధాయి తగ్గుముఖం పడుతుంది.
  2. పప్పుల్లో అధిక మోతాదులో ఉండే ఫొలేట్, మెగ్నిషియం వంటి పోషకాలు గుండెను పదిలంగా ఉంచుతాయని… గుండెసంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయని ఈమధ్యే సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది.
  3. మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు నిత్యం పప్పు దినుసులను ఆహారంలో భాగంగా చేర్చుకున్నట్లయితే…షుగర్ స్థాయిని తగ్గించుకోవచ్చు.
  4. పప్పు దినుసుల్లో ప్రోటీన్లను అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి శక్తితోపాటు….ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
  5. మలబద్దకంతో బాధపడుతున్నవారికి పప్పు దినుసులు మందులా ఉపయోగపడుతాయి. అంతేకాదు డయేరియా వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
  6. అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ పప్పుదినుసులు తీసుకున్నట్లయితే… బరువు కంట్రోల్లో ఉంటుంది.
First Published:  23 Feb 2019 4:20 AM IST
Next Story