నేను టీడీపీలోకి వెళ్తా : సబ్బం హరి
2004, 2009 ఎన్నికల్లో తనను వెన్నంటి ఉండే నాయకులను వైఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అలా ఎంపీ అయిన వ్యక్తే సబ్బం హరి. ఏపీలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. అంతకు ముందు ఏ పెద్ద పదవులు లేని ఆయన ఏకంగా పార్లమెంటు మెట్లు ఎక్కారు. వైఎస్ మరణం తర్వాత జగన్ తన సొంత పార్టీ స్థాపించినప్పుడు సబ్బం హరి జగన్ వెంట ఉన్నాడు. గత ఐదేళ్లుగా ప్రత్యక్ష […]
2004, 2009 ఎన్నికల్లో తనను వెన్నంటి ఉండే నాయకులను వైఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అలా ఎంపీ అయిన వ్యక్తే సబ్బం హరి. ఏపీలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. అంతకు ముందు ఏ పెద్ద పదవులు లేని ఆయన ఏకంగా పార్లమెంటు మెట్లు ఎక్కారు.
వైఎస్ మరణం తర్వాత జగన్ తన సొంత పార్టీ స్థాపించినప్పుడు సబ్బం హరి జగన్ వెంట ఉన్నాడు. గత ఐదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న హరి.. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు.
తనకు ఇకపై రాజకీయాల్లో కొనసాగడానికి రెండే దారులు మిగిలాయని అన్నారు. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదా టీడీపీలో చేరడం అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
సబ్బం హరి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. శనివారం రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఉన్న సమయంలోనే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీ మారుతుండగా…. మరో మాజీ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏపీ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.