కేటీఆర్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదని, వైసీపీ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తెలుగు దేశం ఓటమి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న కేసీఆర్, ఆయన సహచరులకు భంగపాటు తప్పదని ఆయన చెప్పారు. ఇవాళ ట్విట్టర్‌లో వరుసగా కొన్ని పోస్టులు పెట్టిన లోకేష్…. పలు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మోడీ, తెలంగాణ మోడీ కేసీఆర్, ఏపీ మోడీ జగన్‌కు పదే పదే […]
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదని, వైసీపీ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తెలుగు దేశం ఓటమి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న కేసీఆర్, ఆయన సహచరులకు భంగపాటు తప్పదని ఆయన చెప్పారు.
ఇవాళ ట్విట్టర్‌లో వరుసగా కొన్ని పోస్టులు పెట్టిన లోకేష్…. పలు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మోడీ, తెలంగాణ మోడీ కేసీఆర్, ఏపీ మోడీ జగన్‌కు పదే పదే చంద్రబాబే గుర్తొస్తున్నారనే విషయం ఇవాళ కేటీఆర్ మాటలతో అర్థమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ వ్యాప్తంగా పర్యటించిన కేసీఆర్ చివరికి 420 పార్టీతో జతకట్టి కేవలం తెలంగాణకే పరిమితమయ్యారని లోకేష్ ఆరోపించారు.
ఒక్క చంద్రబాబును ఎదుర్కోవడానికి ముగ్గురు నాయకులు జతకట్టి ఎన్నో కుట్రలు చేస్తున్నారని.. అభివృద్ది, సంక్షేమంలో పోటీ పడలేకనే జగన్‌తో కలసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. వాళ్లు కుట్రలు చేస్తున్న విషయం ఇవాళ కేటీఆర్ మాటలతో తేటతెల్లమైందన్నారు.
తెలుగుదేశం పార్టీ ఓటమి కోసం కృషి చేస్తున్న కేసీఆర్, ఆయన సహచరులకు భంగపాటు తప్పదని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం లో పోటీ పడలేక, జగన్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో తెరాస ముందుకొస్తున్న విషయం ఇవ్వాళ కేటీఆర్ మాటల్లో తేలిపోయింది.
— Lokesh Nara (@naralokesh) February 23, 2019