కొత్త కథతో వస్తే రీమేక్ అప్పజెప్పాడు
జస్ట్ ఓ నెల రోజుల కిందటి మాట. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించాడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఎవరూ ఊహించని విధంగా ఫేడ్ అవుట్ అయిన రమేష్ వర్మకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ టైమ్ లోనే అంతా ముక్కున వేలేసుకున్నారు. ఎవరూ లేనట్టు రమేష్ వర్మకు అవకాశం ఇవ్వడం ఏంటని చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడు ఇందులో కొత్త ట్విస్ట్. రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించిన బెల్లంకొండ, అతడు చెప్పిన కథలో […]
జస్ట్ ఓ నెల రోజుల కిందటి మాట. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించాడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఎవరూ ఊహించని విధంగా ఫేడ్ అవుట్ అయిన రమేష్ వర్మకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ టైమ్ లోనే అంతా ముక్కున వేలేసుకున్నారు. ఎవరూ లేనట్టు రమేష్ వర్మకు అవకాశం ఇవ్వడం ఏంటని చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడు ఇందులో కొత్త ట్విస్ట్.
రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించిన బెల్లంకొండ, అతడు చెప్పిన కథలో మాత్రం నటించడానికి ఒప్పుకోలేదు. ముందుగా అతడు చెప్పిన కథనే అంగీకరించినప్పటికీ, తర్వాత తమిళ సినిమా రాట్ససన్ రీమేక్ బాధ్యతను అప్పగించాడు. అలా తను సేఫ్ జోన్ లోకి వెళ్లాడు బెల్లంకొండ. రమేష్ వర్మ మాత్రం కంగుతిన్నాడు. కాకపోతే ఉన్నంతలో ఏదో ఒక సినిమా ఛాన్స్ వచ్చినందుకు ఇతడు కూడా హ్యాపీ.
ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రామానాయుడు స్టుడియోస్ లో ప్రారంభమైన ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తాడు. రేపట్నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 70-75 రోజుల్లో సినిమాను పూర్తిచేయాలనేది ప్లాన్. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు.