ఇకపై మహేష్ తో సెల్ఫీ దిగడం చాలా ఈజీ
మైనపు విగ్రహం కోసం మేడమ్ టుస్సాడ్స్ నిర్వహకులు మహేష్ ను సంప్రదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గతంలోనే 4 గంటలు కేటాయించి, తన శరీరానికి సంబంధించి 200కు పైగా కొలతల్ని వాళ్లకు ఇచ్చాడు. మహేష్ నుంచి జుట్టు, కనుగుడ్డు రంగు సైతం తీసుకున్నారు వాళ్లు. అలా అత్యంత జాగ్రత్తగా మహేష్ మైనపు విగ్రహాన్ని తయారుచేశారు. ఇప్పుడా విగ్రహం హైదరాబాద్ లో కొలువుదీరనుంది. అవును.. 25వ తేదీన ఈ మైనపు విగ్రహాన్ని స్వయంగా మహేష్ బాబు ఆవిష్కరించబోతున్నాడు. […]
మైనపు విగ్రహం కోసం మేడమ్ టుస్సాడ్స్ నిర్వహకులు మహేష్ ను సంప్రదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గతంలోనే 4 గంటలు కేటాయించి, తన శరీరానికి సంబంధించి 200కు పైగా కొలతల్ని వాళ్లకు ఇచ్చాడు. మహేష్ నుంచి జుట్టు, కనుగుడ్డు రంగు సైతం తీసుకున్నారు వాళ్లు. అలా అత్యంత జాగ్రత్తగా మహేష్ మైనపు విగ్రహాన్ని తయారుచేశారు. ఇప్పుడా విగ్రహం హైదరాబాద్ లో కొలువుదీరనుంది.
అవును.. 25వ తేదీన ఈ మైనపు విగ్రహాన్ని స్వయంగా మహేష్ బాబు ఆవిష్కరించబోతున్నాడు. అది కూడా తనకు చెందిన AMB మల్టీప్లెక్సులో ఈ మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారు. అయితే పూర్తికాలం పాటు కాదు. కొన్ని రోజుల పాటు మల్టీప్లెక్సులో మైనపు విగ్రహాన్ని ఉంచి, ఆ తర్వాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ బ్రాండ్ కు ఆ విగ్రహాన్ని తరలిస్తారన్నమాట.
ఇప్పటివరకు టుస్సాడ్స్ మ్యూజియంకు సంబంధించి ఏ విగ్రహాన్ని ఇలా మ్యూజియం బయట ఆవిష్కరించలేదు. మహేష్ కు సంబంధించిన విగ్రహంతోనే ఈ కొత్త సంస్కృతి మొదలైంది. సంస్కృతి ఏదైతేనేం అచ్చంగా మహేష్ లా కనిపించే మైనపు బొమ్మ పక్కన నిల్చొని సెల్ఫీ దిగే అవకాశం మాత్రం హైదరాబాద్ జనాలకు అందుబాటులోకి రాబోతోంది.