Telugu Global
NEWS

పుట్టి మునుగుతుంది బాబులూ జాగ్రత్త....

“పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఇంటెలిజెన్స్ నివేదికలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. రానున్న రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి రాద్ధాంతాలకు తావివ్వకుండా అన్ని కులాల వారితో, మతాల వారికి దగ్గరవ్వాలి. కిందిస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నాయకులు వరకు ఈ విధానాన్ని పాటించాలి” అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు, నాయకులకు చేసిన దిశానిర్దేశం. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో పాటు కొందరు నాయకుల […]

పుట్టి మునుగుతుంది బాబులూ జాగ్రత్త....
X

“పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఇంటెలిజెన్స్ నివేదికలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. రానున్న రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి రాద్ధాంతాలకు తావివ్వకుండా అన్ని కులాల వారితో, మతాల వారికి దగ్గరవ్వాలి. కిందిస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నాయకులు వరకు ఈ విధానాన్ని పాటించాలి” అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు, నాయకులకు చేసిన దిశానిర్దేశం.

పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో పాటు కొందరు నాయకుల నోటి దురుసు కారణంగా పార్టీ అప్రతిష్ట పాలవుతోందని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులు అందరూ తమకు తామే పెద్దలమంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది పార్టీకి చేటు చేస్తుందని చంద్రబాబు హెచ్చరించినట్లు చెప్తున్నారు.

ముఖ్యంగా ఎన్నికల ముందు కులాలు, మతాల గురించి మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం మానుకోవాలని హితవు పలికినట్లు సమాచారం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా దళిత వర్గాలపై చేసిన వ్యాఖ్యలను పార్టీ కొంతవరకు సమర్థిస్తుందని, దాన్ని ఆసరా చేసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించినట్లు చెప్తున్నారు.

రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో గ్రూప్ తగాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, తాను ముందుగా టిక్కెట్లు ప్రకటించడానికి కారణం నాయకులందరూ సఖ్యతతో పనిచేస్తారని చెప్పినట్లు సమాచారం. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో…. అందరు ఐక్యంగా ఉంటే విజయం సాధిస్తాం అని సూచించినట్లు చెబుతున్నారు.

ఏదైనా అంశంపై ఒకరిద్దరు మాట్లాడితే సరిపోదని, రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకుల దగ్గర నుంచి జిల్లా నాయకుల, మండల, బూత్ స్ధాయి నాయకుల వరకూ స్పందించాలని చెప్పినట్లు సమాచారం. దీని వల్ల పార్టీకి మేలు జరుగుతుందే తప్ప కీడు జరగదని అన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఏ విషయంలో చూసినా పార్టీకి అనుకూల వాతావరణం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా పని చేయకపోతే ఓటమి పాలవడం ఖాయమని సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

First Published:  22 Feb 2019 5:10 AM IST
Next Story