చందా కొచ్చర్‌పై లుకౌట్ జారీ
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచ్చర్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ , వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పైనా లుకౌట్ జారీ అయింది. వీరు ముగ్గురు దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారన్న సమాచారంతో సీబీఐ అప్రమత్తమైంది. వీరు ముగ్గురు దేశం విడిచిపారిపోయే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలకు సీబీఐ సమాచారం అందించింది. వీరు ముగ్గురు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లడానికి వీల్లేదని సీబీఐ స్పష్టం చేసింది. చందాకొచ్చర్ ఐసీఐసీఐ […]

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచ్చర్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ , వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పైనా లుకౌట్ జారీ అయింది. వీరు ముగ్గురు దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారన్న సమాచారంతో సీబీఐ అప్రమత్తమైంది.
వీరు ముగ్గురు దేశం విడిచిపారిపోయే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలకు సీబీఐ సమాచారం అందించింది. వీరు ముగ్గురు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లడానికి వీల్లేదని సీబీఐ స్పష్టం చేసింది.
చందాకొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్‌గా ఉన్న సమయంలో భర్త ఒత్తిడితో అవకతవకలతో కూడిన లోన్‌ను వీడియోకాన్ సంస్థకు మంజూరు చేసిన కేసులో వీరు నిందితులుగా ఉన్నారు.