ఆమంచిపై ఇంటెలిజెన్స్ ప్రయోగం
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన చీరాల ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన సెక్యూరిటీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీని వీడిన తర్వాత తన గన్‌మెన్లను మార్చడంపై ఆమంచి అభ్యంతరం తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి గన్‌మెన్లను మార్చడంపై నిరసన తెలిపారు. తాను భద్రత గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రజా జీవితంలో భద్రత ముఖ్యం కాదని… కానీ గన్‌మెన్లు ఇంటెలిజెన్స్ సిబ్బందిగా పనిచేయకూడదని ఆమంచి వ్యాఖ్యానించారు. తన గన్‌మెన్లను మార్చడం ద్వారా కొత్తగా వచ్చిన […]

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన చీరాల ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన సెక్యూరిటీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీని వీడిన తర్వాత తన గన్‌మెన్లను మార్చడంపై ఆమంచి అభ్యంతరం తెలిపారు.
ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి గన్‌మెన్లను మార్చడంపై నిరసన తెలిపారు. తాను భద్రత గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రజా జీవితంలో భద్రత ముఖ్యం కాదని… కానీ గన్‌మెన్లు ఇంటెలిజెన్స్ సిబ్బందిగా పనిచేయకూడదని ఆమంచి వ్యాఖ్యానించారు. తన గన్‌మెన్లను మార్చడం ద్వారా కొత్తగా వచ్చిన గన్‌మెన్లతో తనపై నిఘా ఉంచారన్నది ఆమంచి అనుమానం.