వారు వస్తామంటున్నారు.... వీరు వద్దంటున్నారు!
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు ఎక్కువవుతుంది. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి నాయకులతో పాటు చిన్నా పెద్దా నాయకులు అందరూ కలిపి దాదాపు రెండు వందల మంది పైగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో లోకసభ సభ్యులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేటర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు… ఇలా […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు ఎక్కువవుతుంది. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి నాయకులతో పాటు చిన్నా పెద్దా నాయకులు అందరూ కలిపి దాదాపు రెండు వందల మంది పైగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరిలో లోకసభ సభ్యులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేటర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు… ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులు ఉన్నారు. వీరు కాక కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తామని చెప్పే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రతిష్టగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భవిష్యత్తులో మరి కొందరు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్న తరుణంలో పార్టీలో కొందరు వారిని అడ్డుకుందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.
పలు జిల్లాల్లో ఉన్న సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నా పార్టీలో ఉన్న నాయకులు మాత్రం వాళ్లకు అడ్డుతగులుతున్నారని అంటున్నారు.
దీనికి కారణం భవిష్యత్తులో కొత్తగా పార్టీలో చేరిన నాయకుల వల్ల తమకు ఇబ్బంది వస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోందని అంటున్నారు. పార్టీలో సీనియర్ నాయకులు కొందరు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దీనిపై నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
పార్టీలోకి ఎవరిని పడితే వారిని తీసుకోకుండా వారి వల్ల పార్టీకి ఉపయోగమో… పార్టీ వల్ల వారికి ఉపయోగమా అనేది తేల్చుకుని దాని తర్వాతే వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు.
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న వై.ఎస్.జగన్…. పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత చేరికలపై సీనియర్ నాయకులతో చర్చిస్తారని, దాని తర్వాతే కొత్త వారిని చేర్చుకునే అంశం పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు.