అలా చేస్తే భారత్‌కే నష్టం.... వరల్డ్ కప్‌పై గవాస్కర్
పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో వరల్డ్ కప్‌లో క్రికెట్ ఆడడంపై వస్తున్న అభిప్రాయాలపై మాజీ క్రికెటర్ గవాస్కర్ స్పందించారు. వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించాలన్న డిమాండ్‌పై తన అభిప్రాయం చెప్పారు. టోర్నమెంట్ నుంచి పాకిస్థాన్‌ను వెలివేయడం సాధ్యం కాకపోవచ్చు అన్నారు. భారత్ డిమాండ్‌ను మిగిలిన దేశాలు అంగీకరించకపోవచ్చన్నారు. టోర్నమెంట్‌ను భారత్ బహిష్కరించడం కూడా సరికాదన్నారు. అలా చేస్తే భారత్‌కే నష్టమన్నారు. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఆడి ఆ దేశాన్ని ఓడించాలని గవాస్కర్ సూచించారు. మరో సందర్భంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడిన గవాస్కర్… పాక్ […]
పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో వరల్డ్ కప్‌లో క్రికెట్ ఆడడంపై వస్తున్న అభిప్రాయాలపై మాజీ క్రికెటర్ గవాస్కర్ స్పందించారు. వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించాలన్న డిమాండ్‌పై తన అభిప్రాయం చెప్పారు. టోర్నమెంట్ నుంచి పాకిస్థాన్‌ను వెలివేయడం సాధ్యం కాకపోవచ్చు అన్నారు.
భారత్ డిమాండ్‌ను మిగిలిన దేశాలు అంగీకరించకపోవచ్చన్నారు. టోర్నమెంట్‌ను భారత్ బహిష్కరించడం కూడా సరికాదన్నారు. అలా చేస్తే భారత్‌కే నష్టమన్నారు. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఆడి ఆ దేశాన్ని ఓడించాలని గవాస్కర్ సూచించారు.
మరో సందర్భంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడిన గవాస్కర్… పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కొన్ని సూచనలు చేశారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చర్యలు తీసుకోవాలన్నారు. పాక్ సానుకూలంగా ఒక అడుగు ముందుకేస్తే భారత్‌చాలా అడుగులు ముందుకేస్తుందన్నారు.
ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడం ద్వారా నయా పాకిస్థాన్‌ను ఇమ్రాన్ ఖాన్ చూపించాలన్నారు. ఉగ్రవాద దాడికి కారణమైన వారిని అప్పగించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ సానుకూల సంకేతాలు పంపాలన్నారు.