సైనా " సింధు ఎవరు గొప్ప?
ప్రపంచ 6వ ర్యాంకర్ పీవీ సింధు ప్రపంచ 9వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ సింధూపై 3-1 విజయాలతో సైనా రికార్డు భారత మహిళా బ్యాడ్మింటన్ కు రెండు కళ్ళు లాంటి సింధు, సైనాలలో ఎవరు గొప్ప?… సైనా ప్రత్యర్థిగా సింధు వరుసగా ఎందుకు ఓడిపోతూ వస్తోంది?…అన్న ప్రశ్నలపై ప్రస్తుతం బ్యాడ్మ్మింటన్ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే..ప్రపంచ 6వ ర్యాంకర్ సింధుతో… 9వ ర్యాంకర్ సైనాను పోల్చడం ఏమాత్రం తగదని బ్యాడ్మింటన్ దిగ్గజాలు, విశ్లేషకులు చెబుతున్నారు. చైనా జోరుకు […]
- ప్రపంచ 6వ ర్యాంకర్ పీవీ సింధు
- ప్రపంచ 9వ ర్యాంకర్ సైనా నెహ్వాల్
- సింధూపై 3-1 విజయాలతో సైనా రికార్డు
భారత మహిళా బ్యాడ్మింటన్ కు రెండు కళ్ళు లాంటి సింధు, సైనాలలో ఎవరు గొప్ప?… సైనా ప్రత్యర్థిగా సింధు వరుసగా ఎందుకు ఓడిపోతూ వస్తోంది?…అన్న ప్రశ్నలపై ప్రస్తుతం బ్యాడ్మ్మింటన్ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే..ప్రపంచ 6వ ర్యాంకర్ సింధుతో… 9వ ర్యాంకర్ సైనాను పోల్చడం ఏమాత్రం తగదని బ్యాడ్మింటన్ దిగ్గజాలు, విశ్లేషకులు చెబుతున్నారు.
చైనా జోరుకు బ్రేక్…
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ లో నిన్నటి వరకూ చైనా మాత్రమే సూపర్ పవర్. అయితే …గత కొద్ది సంవత్సరాలుగా భారత్, జపాన్, చైనీస్ తైపీ లాంటి దేశాలు సైతం చైనా ఆధిపత్యానికి గండి కొట్టి..ప్రపంచ మేటిజట్లుగా గుర్తింపు తెచ్చుకొన్నాయి.
23 ఏళ్ల సింధు ప్రపంచ ఆరో ర్యాంక్ ప్లేయర్ గా ఉంటే…. 28 ఏళ్ల వెటరన్ సైనా నెహ్వాల్ మాత్రం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతోంది.
సింధుపై సైనాదే పైచేయి…
ఇటీవలే గౌహతీ వేదికగా ముగిసిన 83వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో వెటరన్ సైనా వరుస గేమ్ ల్లో… సింధును చిత్తు చేసి…తన కెరియర్ లో నాలుగోసారి జాతీయ టైటిల్ అందుకొంది.
అంతేకాదు…. ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో సైతం సింధు పైన సైనాదే పైచేయిగా కనిపించడంతో…ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న అంశమై మరోసారి చర్చకు తెరలేచింది. గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో సైతం సింధు పైన సైనానే విజయం సాధించడం, సింధు ప్రత్యర్థిగా సైనాకు 3-1 రికార్డు ఉండటంతో… ఇది మరింత ఆసక్తికరంగా మారింది.
ఇద్దరూ ఇద్దరే….
సైనా, సింధులలో ఎవరు గొప్ప అన్న విషయం కంటే… ఈ ఇద్దరు షట్లర్లు భారత్ కు సంపాదించిపెట్టిన అపురూప విజయాలు, సాధించిన పతకాలు అన్నీ ఇన్నీ కావు.
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్లో…చైనా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో…పవర్ ఫుల్ చైనా వాల్ ను ఏవిధంగా బద్దలు కొట్టవచ్చో…. సైనా మాత్రమే తన సంచలన విజయాలతో…. ప్రపంచానికి చాటి చెప్పింది.
లండన్ ఒలింపిక్స్ లో….
లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం, ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ లో రజత పతకంతో పాటు… రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకాలు సాధించిన భారత తొలి ప్లేయర్ సైనా నెహ్వాల్ మాత్రమే.
గత దశాబ్దకాలంగా భారత బ్యాడ్మింటన్ కు అలుపెరుగని సేవలు అందించిన సైనా… 28 ఏళ్ల వయసులో… రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆడుతూ వస్తోంది. ఇటీవలే ముగిసిన ఇండోనీషియన్ మాస్టర్స్ టైటిల్ తో పాటు… జాతీయ సీనియర్ ట్రోఫీని అందుకొని… ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాటి చెప్పింది.
సిల్వర్ క్వీన్ సింధు….
మరోవైపు…సైనాకు జూనియర్ గా ఉన్న సింధు సైతం… గొప్పగొప్ప విజయాలే సాధించింది. రియో ఒలింపిక్స్, ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలలో రజత పతకాలు సాధించిన సింధు… కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకం సంపాదించింది.
చైనా ప్లేయర్లను ఓడించడంలో సింధు సైతం సైనాకు తీసిపోని విధంగా నిలిచింది.
భారత బ్యాడ్మింటన్ కు రెండుకళ్లు…
ఇటు సింధు, అటు సైనా… ఇద్దరూ భారత బ్యాడ్మింటన్ కు రెండు కళ్ళు లాంటివారే. ఒకరితో ఒకరిని పోల్చిచూడటం ఏమాత్రం తగదని బ్యాడ్మింటన్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఇద్దరూ సాధించిన విజయాలు చూసి మురిసిపోవాలే కానీ…ఒకరితో ఒకరిని పోల్చిచూడటం అంటే…సమయాన్ని వృధా చేయటమే తప్ప మరేదీ కాదు.