కళా చెప్పింది నిజమా?... చంద్రబాబు చెప్పింది నిజమా?
ఎవరైనా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదన్నారు వైసీపీ నేత సీ. రామచంద్రయ్య. అందుకే చంద్రబాబు ప్రతిసారి రాష్ట్రంలో, రాజకీయాల్లో అలజడి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారని విమర్శించారు. అందుకే మరోసారి ఆంధ్రా, తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలోకి టీడీపీ నేతలు చేరుతుంటే దాని వెనుక కూడా కేసీఆర్ ఉన్నారని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. కేసీఆర్ బెదిరించడం వల్లే చంద్రబాబు ఆంధ్రాకు వచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఏమో టికెట్లు దక్కవన్న ఉద్దేశంతోనే కొందరు టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని […]
ఎవరైనా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదన్నారు వైసీపీ నేత సీ. రామచంద్రయ్య. అందుకే చంద్రబాబు ప్రతిసారి రాష్ట్రంలో, రాజకీయాల్లో అలజడి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారని విమర్శించారు. అందుకే మరోసారి ఆంధ్రా, తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలోకి టీడీపీ నేతలు చేరుతుంటే దాని వెనుక కూడా కేసీఆర్ ఉన్నారని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. కేసీఆర్ బెదిరించడం వల్లే చంద్రబాబు ఆంధ్రాకు వచ్చారా అని ప్రశ్నించారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఏమో టికెట్లు దక్కవన్న ఉద్దేశంతోనే కొందరు టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని చెబుతుంటే…. చంద్రబాబు మాత్రం కేసీఆర్ బెదిరించడం వల్లే వైసీపీలో చేరుతున్నారని చెబుతున్నారని…. ఈ రెండింటిలో ఏది నిజమో టీడీపీ చెప్పాలన్నారు. చంద్రబాబుతో గతంలో కలిసి పనిచేశానని…. కానీ ఆయన మరీ ఇంతగా దిగజారిపోతారని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు.
చంద్రబాబులాంటి రాజకీయ అరాచకశక్తి దేశ రాజకీయాల్లోనే లేదన్నారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు దాసరి జైరమేష్ ఎంతో సాయపడ్డారని… అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలోకి వస్తుంటే పారిశ్రామికవేత్తలకు వైసీపీ టికెట్ ఇస్తోందని చంద్రబాబు విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం రమేష్, సుజనాచౌదరి, మురళీమోహన్, గల్లా జయదేవ్, రాయపాటి, కేశినేని వీళ్లంతా పారిశ్రామికవేత్తలు కాదా అని ప్రశ్నించారు.
వైసీపీ కోడికత్తి పార్టీ అంటూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. 40 ఏళ్ల సీనియర్‌ను అని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రవర్తన మాత్రం చాలా చిన్నోడిలా ఉందన్నారు. చివరకు జవాన్లపై ఉగ్రవాదుల దాడి విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఉగ్రదాడి జరిగితే జాతీయ వాదంతో ఆలోచించాల్సింది పోయి ఈ ఘటనపైనా రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగు పెట్టగానే గోదావరి పుష్కరాల్లో 30 మంది అమాయకులు చనిపోయారని… అప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు.
చంద్రబాబు ఇప్పుడు టీవీల్లో ప్రయోజిత చర్చాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఆ చర్చల్లో యాంకర్లు, విశ్లేషకులు అంతా చంద్రబాబుకు భజన చేసే వారే ఉంటారని ఎద్దేవా చేశారు. నిత్యం ఇదే జరుగుతోందన్నారు.
గుంటూరు జిల్లాలో రైతు కోటయ్య పోలీసుల వేధింపులకు చనిపోతే… ఆయనకు అక్రమ సంబంధాలున్నాయంటూ ప్రచారం చేయించడం ఎంతవరకు
సమంజసమని ప్రశ్నించారు. చింతమనేని దళితులను తిడితే ఏ చానల్ అయినా చర్చ పెట్టిందా అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం సొమ్ముతో పార్టీ కార్యక్రమాలను నిత్వం నిర్వహిస్తున్నారన్నారు. సీఎంవో నుంచి 40, 50వేల మంది టీడీపీ వారితో టెలికాన్ఫరెన్స్‌లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ స్పందించాలన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనే పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రభుత్వంలో జరగకూడనివి చాలా జరుగుతున్నాయని.. బయటకు
వస్తున్నవి చాలా తక్కువ మాత్రమేనన్నారు. విషయాలు బయటకు రాకుండా ప్రతిచోటా తన మనుషులను పెట్టుకున్నారని.. చివరకు న్యాయవ్యవస్థలో కూడా తన వ్యక్తులను పెట్టుకున్నారని ఆరోపించారు.
కంసుడు కుక్కను, నక్కను చూసినా కృష్ణుడు వచ్చాడేమోనని భయపడుతూ నిత్యం చచ్చాడని… ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ఆర్థిక మంత్రి యనమల సహకరించకుండానే ఏపీలో ఇంత తక్కువ సమయంలోనే ఇంత భారీ అవినీతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ అమరావతికి వస్తే సిగరెట్ కూడా వెలిగించిన వారు టీడీపీ నేతలన్నారు. హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కలిసి పోటీ చేద్దామని టీఆర్‌ఎస్‌తో మంతనాలు జరిపింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.