పుల్వామా ఉగ్రదాడి... ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మంగళవారం నాడు వైట్‌హౌస్‌లోని తన ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అదొక భయంకరమైన పరిస్థితి అని.. పుల్వామా దాడికి సంబంధించి అనేక రిపోర్ట్స్ తనకు చేరాయని.. సరైన సమయంలో వాటిని వెల్లడిస్తానని ట్రంప్ చెప్పారు. భారత్, పాక్‌ను ఉద్దేశించి.. ఆ పొరుగు దేశాలు రెండూ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటే అద్భుతంగా ఉంటుందంటూ సలహా ఇచ్చారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి […]

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మంగళవారం నాడు వైట్‌హౌస్‌లోని తన ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
అదొక భయంకరమైన పరిస్థితి అని.. పుల్వామా దాడికి సంబంధించి అనేక రిపోర్ట్స్ తనకు చేరాయని.. సరైన సమయంలో వాటిని వెల్లడిస్తానని ట్రంప్ చెప్పారు. భారత్, పాక్‌ను ఉద్దేశించి.. ఆ పొరుగు దేశాలు రెండూ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటే అద్భుతంగా ఉంటుందంటూ సలహా ఇచ్చారు.
ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పదుల సంఖ్యలో రిపోర్ట్స్ వచ్చాయని.. వాటన్నింటినీ నేను చూశానని.. త్వరలోనే నా అభిప్రాయాన్ని వెల్లడిస్తానని ట్రంప్ చెప్పారు.