Telugu Global
National

డబ్బిస్తే అనుకూల ట్వీట్లు... స్టింగ్ ఆపరేషన్లో దొరికిన సోనూ సూద్, సన్నీలియోన్ సహా 36 మంది

మీరు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నారా? ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారా? అయితే వారి నుంచి వచ్చే ట్వీట్లను ఎప్పుడైనా గమనించారా? అప్పుడప్పుడూ కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు అనుకూలంగా, పొగుడుతూ పోస్టులు పెడుతుంటారు. నిజమేనేమో.. వాళ్లంటే ఈ సెలబ్రిటీలకు ఎంత అభిమానమో, గౌరవమో అనుకుంటాం. కాని ఇలాంటి పోస్టులలో చాలా వరకు పెయిడ్ పోస్టులే అని ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. ఇలాంటి అనుకూలమైన పోస్టులు పెట్టడానికి లక్షల రూపాయలు తీసుకుంటారని తెలిసింది. […]

డబ్బిస్తే అనుకూల ట్వీట్లు... స్టింగ్ ఆపరేషన్లో దొరికిన సోనూ సూద్, సన్నీలియోన్ సహా 36 మంది
X

మీరు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నారా? ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారా? అయితే వారి నుంచి వచ్చే ట్వీట్లను ఎప్పుడైనా గమనించారా? అప్పుడప్పుడూ కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు అనుకూలంగా, పొగుడుతూ పోస్టులు పెడుతుంటారు. నిజమేనేమో.. వాళ్లంటే ఈ సెలబ్రిటీలకు ఎంత అభిమానమో, గౌరవమో అనుకుంటాం.

కాని ఇలాంటి పోస్టులలో చాలా వరకు పెయిడ్ పోస్టులే అని ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. ఇలాంటి అనుకూలమైన పోస్టులు పెట్టడానికి లక్షల రూపాయలు తీసుకుంటారని తెలిసింది. స్టింగ్ ఆపరేషన్లు చేయడంలో దిట్ట అయిన ‘కోబ్రా పోస్ట్’ అనే సంస్థ బాలీవుడ్ తారల అసలు గుట్టు విప్పేసింది. దీనికి ‘ఆపరేషన్ కరావోకే’ అనే పేరు పెట్టింది.

ఒక పబ్లిక్ రిలేషన్ ఏజన్సీ (పీఆర్ ఏజెన్సీ) తరపున వచ్చామంటూ కోబ్రా పోస్ట్ ప్రతినిధులు 36 మంది బాలీవుడ్ నటులు, గాయకులను కలిశారు. వీరిలో జాకీష్రాఫ్, సోనూసూద్, వివేక్ ఓబెరాయ్, శక్తి కపూర్, అమీషా పటేల్, రాఖీ సావంత్, సన్నీలియోన్, గాయకులు కైలాష్ ఖేర్, మికా సింగ్, బాబా సెహగల్ ఇలా చాలా మంది ఉన్నారు.

మీరు పలువురు రాజకీయ నాయకులకు, పార్టీలకు అనుకూలంగా మీ సొంత అభిప్రాయం అనిపించేలా పోస్టు చేయండి మేం మీకు డబ్బు ఇస్తాం అని వారిని కలిశారు. ఒక్కో పోస్టుకు 2 నుంచి 50 లక్షల వరకు చెల్లిస్తామని కూడా ఆఫర్ చేశారు. దానికి సదరు నటులు సానుకూలంగా స్పందించారు. ఇక సోనూ సూద్ 8 నెలల కాంట్రాక్టుకు 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు.

మినిషా లాంబా వంటి నటులు క్యాష్ రూపంలో (అంటే బ్లాక్ మనీ) కావాలని కోరారు. అంతగా మీరు జీఎస్టీ చెల్లించాలనుకుంటే 80 శాతం బ్లాక్ మనీ ఇచ్చి మిగతాది మీ ట్యాక్స్ కోసం వైట్‌లో చెల్లించమని సలహా కూడా ఇచ్చింది.

ఇక ఇదే సంస్థ అర్షద్ వార్సీ, విద్యాబాలన్, రజా మురద్, సౌమ్యా టాండన్ వంటి వారిని సంప్రదిస్తే ఇలాంటి పనులు మేం చేయమని నిరాకరించారు. నిన్న ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో కోబ్రా పోస్ట్ ప్రతినిధులు దీనికి సంబంధించిన 60 నిమిషాల వీడియో డాక్యుమెంటరీని విడుదల చేశారు.

ఈ విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేగింది. ట్విట్టర్‌లో ఆపరేషన్ కరావోకే పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

First Published:  20 Feb 2019 12:07 AM GMT
Next Story