Telugu Global
International

సంతాపమే కాదు... భారత్‌కు స్ట్రాంగ్ సపోర్టు ఇస్తాం " అమెరికా

పుల్వామా ఉగ్రవాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. పుల్వామా దాడిని భయానక సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై తనకు చాలా నివేదికలు వచ్చాయని చెప్పారు. వాటిని తాను పరిశీలించానని వెల్లడించారు. దీనిపై సరైన సమయంలో అమెరికా ప్రకటన విడుదల చేస్తుందన్నారు. అటు ప్రత్యేకంగా మాట్లాడిన అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ రాబర్ట్ పలడినో.. ఈ ఘటనపై భారత్‌ దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తామన్నారు. ఉగ్రదాడి అంశంలో సంతాపంతో సరిపెట్టబోమని… భారత్‌కు గట్టి మద్దతు కూడా ఇస్తామని […]

సంతాపమే కాదు... భారత్‌కు స్ట్రాంగ్ సపోర్టు ఇస్తాం  అమెరికా
X

పుల్వామా ఉగ్రవాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. పుల్వామా దాడిని భయానక సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై తనకు చాలా నివేదికలు వచ్చాయని చెప్పారు. వాటిని తాను పరిశీలించానని వెల్లడించారు. దీనిపై సరైన సమయంలో అమెరికా ప్రకటన విడుదల చేస్తుందన్నారు.

అటు ప్రత్యేకంగా మాట్లాడిన అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ రాబర్ట్ పలడినో.. ఈ ఘటనపై భారత్‌ దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తామన్నారు. ఉగ్రదాడి అంశంలో సంతాపంతో సరిపెట్టబోమని… భారత్‌కు గట్టి మద్దతు కూడా ఇస్తామని చెప్పారు. ఈ దాడి వెనుక ఎంతటివారున్నా సరే వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు.

First Published:  20 Feb 2019 6:29 AM IST
Next Story