Telugu Global
NEWS

జేసీ ట్రావెల్స్ డ్రైవర్‌తో మహిళకు కాళ్లు పట్టించారు....

జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ను విజయవాడలో ప్రయాణికురాలి బంధువులు కొట్టారు. ప్రయాణికురాలిని దూషించడంతోపాటు ఆమెపై చేయి చేసుకున్నందుకు ఆమె బంధువులు డ్రైవర్‌ను చితకబాదారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉప్పలపాడు లత హైదరాబాద్‌లో అబిబస్ యాప్ ద్వారా టికెట్ బుక్‌ చేసుకున్నారు. ఆమె కొండాపూర్‌లో మధ్యాహ్నం 2.20 నిమిషాలకు జేసీ ట్రావెల్స్ బస్సు ఎక్కాల్సి ఉంది. కానీ బస్సు సకాలంలో రాలేదు. దీంతో ఆమె అబిబస్ వారికి ఫోన్ చేయగా… బస్సు డ్రైవర్‌తో మాట్లాడారు. లక్డీకపూల్‌కు ఆమెను రావాల్సిందిగా డ్రైవర్ సూచించాడు. కానీ […]

జేసీ ట్రావెల్స్ డ్రైవర్‌తో మహిళకు కాళ్లు పట్టించారు....
X

జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ను విజయవాడలో ప్రయాణికురాలి బంధువులు కొట్టారు. ప్రయాణికురాలిని దూషించడంతోపాటు ఆమెపై చేయి చేసుకున్నందుకు ఆమె బంధువులు డ్రైవర్‌ను చితకబాదారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉప్పలపాడు లత హైదరాబాద్‌లో అబిబస్ యాప్ ద్వారా టికెట్ బుక్‌ చేసుకున్నారు. ఆమె కొండాపూర్‌లో మధ్యాహ్నం 2.20 నిమిషాలకు జేసీ ట్రావెల్స్ బస్సు ఎక్కాల్సి ఉంది. కానీ బస్సు సకాలంలో రాలేదు. దీంతో ఆమె అబిబస్ వారికి ఫోన్ చేయగా… బస్సు డ్రైవర్‌తో మాట్లాడారు. లక్డీకపూల్‌కు ఆమెను రావాల్సిందిగా డ్రైవర్ సూచించాడు. కానీ లక్డీకపూల్‌లో బస్సు ఆపకపోవడంతో తన స్నేహితుడి సాయంతో కారులో బస్సును చేజ్ చేసి మెహదీపట్నం వద్ద బస్సుకు అడ్డుగా కారును ఉంచింది. దాంతో డ్రైవర్ ఆమెను బూతులు తిట్టాడు.

లత, ఆమె స్నేహితుడు బస్సు ఎక్కగానే మరోసారి బూతులు తిట్టాడు. దాంతో డ్రైవర్‌పై ఉప్పలపాడు లత తొలుత చేయి చేసుకుంది. తిరిగి డ్రైవర్‌ కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. 100 నెంబర్‌కు కాల్ చేయగా సూర్యపేట పోలీసులు
స్పందించారు. బస్సును మధ్యతో ఆపితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని.. కాబట్టి విజయవాడకు వెళ్లి అక్కడే ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు సూచించారు. దాంతో విజయవాడ సమీపంలోకి వెళ్లగానే లత తన కుటుంబసభ్యులకు
విషయాన్ని ఫోన్‌లో చెప్పింది. దాంతో వారు వచ్చి బస్సును ఆపి డ్రైవర్‌ను చితక్కొట్టారు. డ్రైవర్‌ చేత ఆమె కాళ్లు పట్టించారు. ఈ ఘటనపై జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించలేదు.

First Published:  20 Feb 2019 5:46 AM IST
Next Story