Telugu Global
NEWS

యధాతథంగా ఇండో-పాక్ ప్రపంచకప్ మ్యాచ్

మనుషులను కలిపే శక్తి క్రికెట్ కు మాత్రమే ఉంది-డేవ్ రిచర్డ్స్ సన్ పుల్వామా అమరులకు ఐసీసీ సంతాపం ఇంగ్లండ్ వేదికగా త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా జరిగే మ్యాచ్ ను టీమిండియా బహిష్కరించాలంటూ ఓవైపు హర్భజన్ సింగ్ లాంటి మాజీ క్రికెటర్లు గొంతెత్తి అరుస్తుంటే… .ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్స్ సన్ మాత్రం… మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని, ప్రోగ్రామ్ లో ఏవిధమైన మార్పులేదని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి […]

యధాతథంగా ఇండో-పాక్ ప్రపంచకప్ మ్యాచ్
X
  • మనుషులను కలిపే శక్తి క్రికెట్ కు మాత్రమే ఉంది-డేవ్ రిచర్డ్స్ సన్
  • పుల్వామా అమరులకు ఐసీసీ సంతాపం

ఇంగ్లండ్ వేదికగా త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా జరిగే మ్యాచ్ ను టీమిండియా బహిష్కరించాలంటూ ఓవైపు హర్భజన్ సింగ్ లాంటి మాజీ క్రికెటర్లు గొంతెత్తి అరుస్తుంటే… .ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్స్ సన్ మాత్రం… మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని, ప్రోగ్రామ్ లో ఏవిధమైన మార్పులేదని స్పష్టం చేశారు.

పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఐసీసీ తరపున సంతాపం తెలిపారు. శత్రువులను మిత్రులుగా మార్చే శక్తి కేవలం క్రికెట్ కు మాత్రమే ఉందని అన్నారు.

మరోవైపు… పాక్ తో ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ను బహిష్కరించాలంటూ హర్భజన్ ఇచ్చిన పిలుపును బీసీసీఐ సీనియర్ సభ్యుడు ఒకరు తప్పుపట్టారు.

టీమిండియా ఒకవేళ సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్ లో పాక్ ప్రత్యర్థిగా తలపడాల్సి వస్తే మ్యాచ్ ను బహిష్కరిస్తారా అంటూ ప్రశ్నించారు.

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా జూన్ 16 న మాంచెస్టర్ వేదికగా భారత్, పాక్ జట్ల మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే.

First Published:  20 Feb 2019 3:05 PM IST
Next Story